జూ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ని ఫాలోఅవడం వరకూ బాగానే వుంది కానీ..?
హిందీలో మాట్లాడినా, బెంగాలీలో మాట్లాడినా, చివరికి స్పానిష్ లో మాట్లాడినా, పవన్ కళ్యాణ్ తన బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయేలా మేనేజ్ చేసేస్తాడు. ఈసారి జూ ఎన్టీఆర్ సైతం ఇదే రకమైన అతికి పోయి అతికించిన హిందీతో 'శక్తి"లో హింస పెట్టాడు. జైపూర్ లో 2011లో సల్మాన్ ఖాన్ సినిమా 'వాంటెడ్" రిలీజ్ అనే ఓ పనికిరాని సీను అల్లుకున్న మెహర్ రమేష్, ఏ వన్ స్టార్ 1యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తో హిందీని తెలుగులా మాట్లాడించేసి పొంగిపోయుంటాడు. తీరా స్క్రీన్ మీద ఆ సీన్ చూస్తుంటే ఎందుకొచ్చి కష్టం రా నాయనా అనుకునేలా చేశాడు. పవన్ కళ్యాణ్ ని ఫాలో అవడం వరకు బాగానే వుంది కానీ దానికి సరిపడా సరంజామా ఏర్పాటు చేసుకోవడంలో ఎన్టీఆర్, మెహర్ లు పూర్తిగా విఫలమయ్యారు అనేది సుస్పష్టంగా కనిపిస్తోంది.
jr ntr shakti meher ramesh pawan kalyan teen maar జూ ఎన్టీఆర్ శక్తి మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ తీన్ మార్


Click it and Unblock the Notifications