twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ గాయంపై అనేక అనుమానాలు.. ఫ్యాన్స్‌లో ఆందోళన.. RRRపై దెబ్బ మీద దెబ్బ!

    |

    బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా మొదలైన RRR చిత్రానికి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. సవ్యంగా సాగుతుందనుకొన్న షూటింగ్‌కు గాయాల బెడద తగులుకుంది. దాంతో పలు షెడ్యూళ్లు వాయిదాలపై వాయిదా పడుతున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ గాయం కారణంగా RRR షూటింగ్ మరికొన్నాళ్లు వాయిదా వేయడంతో అసలు ఏం జరుగుతున్నదనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

    డైసీతో మొదటి దెబ్బ

    డైసీతో మొదటి దెబ్బ

    అగ్ర హీరోల హాజరుతో సెన్సేషనల్‌గా ప్రారంభమైన RRR షూటింగ్ వరుస షెడ్యూళ్లను పూర్తి చేసుకొన్నది. అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఈ సినిమా హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం కథ మొదటికి వచ్చింది. వాస్తవానికి ఎన్టీఆర్ సరసన డైసీ నటించాల్సింది. కానీ కుటుంబ కారణాలు చూపుతూ సినిమా నుంచి నిష్క్రమించడంతో మొదటి దెబ్బ తగిలింది.

    రాంచరణ్‌ గాయంతో మొదటిసారి వాయిదా

    రాంచరణ్‌ గాయంతో మొదటిసారి వాయిదా

    డైసీ స్థానంలో మరో హీరోయిన్‌ను వెతుకుతూనే ఉత్తరాదిలో భారీ షెడ్యూల్‌ను RRR టీమ్ భారీగా ప్లాన్ చేసింది. గుజరాత్, పూణేలో పక్కా ప్లానింగ్‌తో టీమ్ ముందుకెళ్లింది. గుజరాత్‌లో షూటింగ్ జరుగుతుండగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాలికి గాయం కావడంతో షెడ్యూల్‌ను వాయిదా వేశారు. దాంతో రెండో దెబ్బ తగిలింది.

    జూ ఎన్టీఆర్ గాయంతో మరో ఝలక్

    జూ ఎన్టీఆర్ గాయంతో మరో ఝలక్

    ఎన్నికల హడావిడి ముగియడం, రాంచరణ్ గాయం నుంచి కోలుకొంటుండగా.. హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. తీరా షూటింగ్ మొదలుపెట్టడానికి ముందు ఎన్టీఆర్ గాయపడటంతో మూడో దెబ్బ గట్టిగానే తగిలింది. అయితే ఎన్టీఆర్ గాయాన్ని టీమ్ బయటకు వెల్లడించకుండా జాగ్రత్త పడింది. కానీ హాస్పిటల్‌ను సందర్శించడంతో ఈ వార్త మీడియాకు పొక్కింది.

    గాయంపై అనేక సందేహాలు

    గాయంపై అనేక సందేహాలు

    చేతికి కట్టుతో ఎన్టీఆర్ ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో గాయం బలమైందనే మాట వినిపిస్తున్నది. ఎన్టీఆర్ గాయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. షూటింగ్‌లో గాయపడ్డారా? లేక ఇంటిలోనో లేదా జిమ్‌లోనో గాయమైందా అనేది అభిమానులను పలు ప్రశ్నలు వేధిస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ గుంభనంగా ఉండటం ఈ వ్యవహారం మరింత ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ గాయాన్ని ఎందుకు దాచిందనే మాట అభిమానుల్లో చర్చ జరుగుతున్నది.

    వరుస గాయాలతో ఇబ్బందులు

    వరుస గాయాలతో ఇబ్బందులు

    ఇలా వరుసగా గాయాల సమస్య వేధించడం RRR సినిమాపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఈ సినిమాలో సముద్రఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ లాంటి నటులను రంగంలోకి దించారు. షూటింగ్ జాప్యం వల్ల ఇతర నటీనటులు కాల్షీట్స్ అడ్జస్ట్ చేయాల్సిన ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

    అన్ని భాషల్లో RRR మూవీ

    అన్ని భాషల్లో RRR మూవీ

    బాలీవుడ్ నటి అలియాభట్ నటిస్తున్న RRR చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుమారు రూ.400 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. జాతీయ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారతీయ అన్ని భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Photos of Jr NTR are going viral on social media in which the actor is seen wearing a wrist band on his right hand suggesting he might be injured. However, it is not clear yet if he is injured or if it is just a precaution to prevent any mishaps. Fans are quite worried about the Jr NTR's situation and speculations about it are spreading like wildfire.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X