twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ లేనిదే నా సినిమా లేదు రాజమౌళి..., కాంపిటీషకూడా ఉంది మరి

    |

    రాజమౌళి 'గరుడ' కథ 'మహాభారతం' నేపథ్యంలోనే ఉంటుందా? అవునని కొందరు, కాదని కొందరు సినీ క్రిటిక్స్ వాదులాడుకుంటున్న టైమ్ లోనే, ఇంకో ఎమేజింగ్ వార్త బయటకొచ్చింది. ఇప్పటికే ఈ 'గరుడ' పైన రాజమౌళి ఐదుగురు ప్రముఖులను సంప్రదించారనీ, అందులో ఇద్దరు సాహితీ సినీ రంగాలతో సంబంధాలున్నవారనీ, మిగిలిన ముగ్గురిలో ఒకరు బిగ్ 'బీ' అనీ, ఇంకొకరు థియేటర్-కమ్-మూవీ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ అనీ, ఆఖరున డ్రీమ్ గర్ల్ హేమమాలిని అనీ! గరుడ సినిమా స్క్రిప్ట్ లో భాగంగా పురాణ పురుషుడు గరుత్మంతుడి కథను ఇతిహాసానికి కనెక్ట్ చేస్తూ కథని తయారు చేసారూ అని సంవత్సరం క్రితమే వార్తలొచ్చాయి.

    ఇహ ఇందులో మహేష్ బాబు నటిస్తాడన్న ప్రచారం ఓవైపు ... జూనియర్ ఎన్టీ ఆర్, మోహన్ లాల్ తో కీలక పాత్రలు చేయించడానికి కూడా మరో వైపు టాక్స్ నడుస్తున్నట్టు మరో వార్త. ఇవన్నీ ఇలా ఉంటే.....కథ లో ఉండే డిమాండ్ దృష్ట్యా, స్క్రీన్ కు మరింత వెయిట్ కోసం బిగ్ బీ అమితాబ్ చేత ఇందులో 'భీష్మ' పాత్ర చేయించటానికి ఆయనతో రాజమౌళి...హిందీ సినిమా రంగం లోతనకున్న పరిచయాలద్వారా సంప్రదింపులు మొదలెట్టినట్టు తెలుస్తోంది. కథ లో కొంత మేరకు రామాయణం నుంచి కూడా తీసుకోవలసి ఉంటుంది కాబట్టి......అందులో కొన్ని పౌరాణిక పాత్రల కోసం హిందీ చిత్ర రంగ ప్రముఖులను ఎంపిక చేసే ఆలోచన కూదా ఉందట. ఎటూ 1000 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి నేషనల్ రేంజ్ లో నటీ నటులని తీసుకోవలసి వస్తుంది. అంటూ అప్పట్లో అన్ని ప్రముఖ పత్రికలూ, న్యూస్ పోర్టల్స్ ప్రచారం చేస్తూ కథనాలు రాసాయి. అయితే ఆ తర్వాత మరో వార్త వినిపించింది....అదేమిటంటే...

    గరుడ చిత్రం కాదట:

    గరుడ చిత్రం కాదట:

    గరుడ గా అనుకున్న ఆ చిత్రం లో మహేష్ చేయటం లేదనీ తేలిపోయింది. అయితే జూనియర్ ని మాత్రం వదలనంటున్నాడు మన స్టార్ డైరెక్టర్. బాహుబలి2 తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ తో జతకట్టడం నిజమేనట. కానీ.. అది గరుడ చిత్రం కాదట. ఇదో ఇంకో కథట. అది కూడా అద్భుతంగా ఉండనుందట. ఇటీవలే స్టోరీ లైన్ కూడా ఎన్టీఆర్ కి వినిపించాడట జక్కన్న. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అయితే, రాజమౌళి - ఎన్టీఆర్ ల గరుడ లేదని విషయం నందమూరి అభిమానులకు మింగుడు పడటం లేదు. అయితే ఇంకా ఈ విశయం మీద మాత్రం ఖచ్చితమైన క్లారిటీ మాత్రం ఎవరికీ లేదు.

    ఎన్టీఆర్ మాత్రమే :

    ఎన్టీఆర్ మాత్రమే :

    అయితే బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ‘మ‌హా భార‌తం'ను సినిమాగా చేసే అవ‌కాశాలున్నాయ‌ని కొన్ని నెల‌లుగా వార్తలు వ‌స్తున్నాయి. వాటిని జ‌క్కన్న కూడా ప‌లు సంద‌ర్భాల్లో ధృవీక‌రించాడు. ఎప్పటికైనా ‘మ‌హాభార‌తం'ని సినిమాగా తెర‌కెక్కిస్తాన‌ని అన్నాడు. మ‌హాభార‌తం తెర‌కెక్కిస్తే అందులో ఓ కీల‌క‌పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే సూట‌వుతాడ‌ని జ‌క్కన్న స్నేహితులతో అంటున్నాడ‌ట‌. ఎన్టీఆర్ లేకుండా మ‌హా భారతం అనే ఆలోచ‌న త‌న మ‌దిలో లేద‌ని ఘంటాప‌థంగా చెబుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. అందులో డిఫ‌రెంట్ క్యారెక్టర్లను ఎన్టీఆర్ తో చేయించే ఛాన్సుందిట‌. దానికి సంబంధించి ఆర్ట్ అండ్ డిజైనింగ్ వ‌ర్క్ మొద‌లైన‌ట్లు ఫిలిం సర్కిల్స్ లో ముచ్చటించుకుంటున్నారు....

    యూనివర్సల్ స్టోరీ:

    యూనివర్సల్ స్టోరీ:

    ఈ మధ్య ఓ టివిలో ‘బాహుబలి' సక్సెస్ మీట్ లో పాల్గొన్న రాజమౌళి మహా భారతం తీస్తే ఎవరిని శ్రీ కృష్ణుడుగా ఎంచుకుంటారు అనే ప్రశ్న అడిగితే రాజమౌళి వెంటనే ఇప్పుడున్న యంగ్ హీరోలలో ఎన్.టి.ఆర్ శ్రీ కృష్ణుడు పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని తెలిపాడు. ఈ సమాధానం మరింత మహాభారతాన్ని సినిమాగా చేయటం కోసం రాజమౌళి ఓ పక్కా ప్రణాళికని వేసుకున్నాడని అంటున్నారు. మహాభారతం యూనివర్సల్ స్టోరీ. ఇందులో ఎన్నో రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంతకు మించిన గొప్ప కథ దొరకటం కూడ సాధ్యపడని విషయం.

    రాజమౌళి కామెంట్:

    రాజమౌళి కామెంట్:

    అందుకే మహాభారతాన్ని తెరకెక్కించి సత్తాచాటాలనేది రాజమౌళి నిర్ణయం. అయితే తన ప్రయత్నం ప్రారంభం అయ్యేసమయానికి ఈ కథకి సంబంధించిన నటులను గుర్తించటంలో రాజమౌళి ఇప్పటికే తలమునకలుగా ఉన్నాడట. ఎన్టీఆర్ వంటి యాక్టర్ లేని మహాభారతం ఉండదని రాజమౌళి కామెంట్ చేయటం విశేషం. మొత్తంగా ఎన్టీఆర్ పై రాజమౌళికి ఉన్న నమ్మకం ఏపాటిదో...ఈ విషయాన్ని చూస్తే అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరూ స్టూడెంట్ నెం.1 మూవీ విషయంలో వారి పాత స్నేహానికి సంబంధించిన విషయాలను గుర్తుచేసుకున్నారు.మొత్తానికి ఇంకో సారి ప్రపంచ సినిమాని తెలుగు ఇండస్ట్రీ వైపు చూసి అసూయ పడేలా చేయటం మాత్రం ఖాయం అంటున్నారు ఈ ఇద్దరి అభిమానులూ...

    కాంపిటీషన్ బలంగానే ఉంది:

    కాంపిటీషన్ బలంగానే ఉంది:

    అయితే ఈ భారతం ఇక్కడితో ముగియలేదు. ఈ ఎపిక్ స్టోరీకీ కాంపిటీషన్ బలంగానే ఉంది మరి రాజమౌళి అనే ఒక మైల్ స్టోన్ ని దాటి వెళ్ళాలి ఇప్పటి పరిస్థితి ప్రకారం. ఎవన్నా ఇప్పుడు మహాభారతం తీస్తాం అంటే.. ముందు ఆ మైలు రాయిని దాటి ముందుకు వెళ్లాలి. దర్శకుడు రాజమౌళి కే వుంది ఆ ఆలోచన. కానీ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావు కూడా మహా భారతం తీస్తారట.. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. బోలెడు పార్ట్ ల్లో.. సాధ్యమేనా? నమ్మదగ్గ విషయమేనా? అయితే దాసరి మరో విషయం కూడా క్లియర్ చేసారు.. అలా చేసే మహాభారతం తన ఆఖరి సినిమా అంట. దాని తరువాత మరి సినిమాలు చేయరంట.

    రామాయణం:

    రామాయణం:

    అంటే ఇప్పట్లో కాదనేగా.. ఆయన ప్రకటించిన ప్రాజెక్టులు అన్నీపూర్తి కావాలంటే.. కనీసం రెండేళ్లు పైనే పడుతుంది. ఆ తరువాతి సంగతి మహాభారతం. ఎప్పటికైనా మహాభారతం తీయాలనుందని రాజమౌళి అంటే ఎవరికీ ఆశ్చర్యం కలగలేదు. మగధీర, బాహుబలి లాంటి అద్భుతమైన కలల్ని కని.. వాటిని తెరమీదికి తెచ్చిన వాడు.. 'మహాభారతం' కూడా తీసేయగలడని అందరూ నమ్మేస్తారు. కానీ పరాయి భాషల్లో కథల్ని పట్టుకొచ్చి బాలీవుడ్లో రీమేక్ చేసి పాపులరైన ప్రభుదేవా లాంటి వాడు రామాయణాన్ని సినిమాగా తీస్తాడంటే నవ్వు రాదూ. కానీ ప్రభుదేవా మాత్రం రామాయణం మీద సినిమా తీసి తీరుతానని కాన్ఫిడెంటుగా చెబుతున్నాడు. అందుకు తాను సిద్ధంగానే ఉన్నానని.. ఐతే సరరైన నిర్మాత కోసం చూస్తున్నానని చెప్పాడు ప్రభుదేవా.

    English summary
    It is buzzing that Jr.NTR has nodded his head for project on Mahabharata and Vijayendra Prasad completed scripting works for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X