Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాలో నటించిన ప్రతీ హీరోకు ఫ్లాపులు రావడం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సెంటిమెంట్ గురించి భారీగానే చర్చ జరుగుతున్నది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర ఈ సెంటిమెంట్‌ను తొక్కేసి.. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొంటుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
రాజమౌళి సినిమాల విషయానికి వస్తే.. హీరోలకు ఇచ్చే బిల్డప్, ఎలివేషన్స్ హై స్టాండర్డ్స్‌లో ఉంటాయి. అయితే ఆ సినిమా తర్వాత వచ్చే హీరో చిత్రాలపై అంచనాలు రెండితలు పెంచేలా ఉంటాయి. దాంతో అంచనాలను మించి లేకపోవడం వల్ల ప్రభాస్, నాని, రాంచరణ్ లాంటి హీరోల సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. ఈ సెంటిమెంట్ అలానే కొనసాగుతున్నది.

అయితే రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన RRR సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ నటించారు. అయితే ఆ సినిమా తర్వాత చెర్రీ నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్‌గా నిలిచి ఆ సెంటిమెంట్‌కు బలం చేకూర్చింది. ఇక మిగిలి ఉంది ఎన్టీఆర్ సినిమా. ప్రస్తుతం దేవర చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులను ఈ విషయం కంగారు పెడుతున్నది.
ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. వాస్తవానికి వేసవిలోనే రిలీజ్ కావాల్సింది. కానీ టెక్నికల్ వర్క్ కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఈ సినిమాను అక్టోబర్ 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు మించి మూవీ ఉంటుందా? రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

దేవర చిత్రానికి గతంలో ఆచార్య లాంటి డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ. ప్రస్తుతం ఆయనకు ఈ సినిమా ఓ ఛాలెంజ్‌లా నిలిచింది. ఎన్టీఆర్ అభిమానులను తన సినిమాతో ఎలా మెప్పిస్తాడనే మరో క్యూరియాసిటీ కూడా బలంగా ఉంది. ఇలాంటి సెంటిమెంట్స్‌ను దేవర అధిగమిస్తుందా అనేది వేచి చూడాల్సిదే.
ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా లెవెల్‌లో దేవర చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, డిస్టిబ్యూటర్ అనిల్ తడానీ ఉత్తర భారతంలో హిందీ వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అనిల్ తడానీ పలు తెలుగు సినిమాలను పాన్ ఇండియాలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన ఘనత ఉంది. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ కెరీర్‌లో నిలిచిపోయేలా అత్యధిక స్థానాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











