జస్టిన్ బీబర్‌కు భార్య నరకం.. పబ్లిక్‌గా పార్కులోనే.. డిప్రెషన్‌లోకి పాప్‌స్టార్!
తన మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఊర్రూతలూగించిన జస్టిన్ బీబర్ ఇప్పుడు భార్య పెట్టే బాధలకు వణికిపోతున్నాడట. ఏకంగా పార్కులోనే వారిద్దరూ గొడవపెట్టుకొని ఒకరిపై మరొకరు కోపగించుకోవడం మీడియా క్లిక్ మనిపించింది. జస్టిన్ బీబర్, హెయిలీ బాల్డ్‌విన్ ఇటీవలే వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. అప్పుడే వారిద్దరు పబ్లిక్ ప్లేస్‌లో గొడవపడటం చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే..

జస్టిన్ బీబర్, హెయిలీ మధ్య గొడవలు
మార్చి 16వ తేదీన కాలిఫోర్నియాలోని లాగునా బీచ్‌లో సేద తీరేందుకు జస్టిన్ బీబర్, హెయిలీ బాల్డ్‌విన్ వెళ్లారు. అక్కడ వారి మధ్య వేడివేడిగా సంభాషణ జరగడంతో బీబర్ ముఖంలో టెన్షన్ కనిపించింది. తనలోని కోపాన్ని బయటకు కనిపించడకుండా తన నల్లటి హుడీతో ముఖాన్ని కప్పుకొనే ప్రయత్నించినట్టు హాలీవుడ్ లైఫ్ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

కొద్ది నెలలుగా మనస్పర్ధలతో
బీబర్, హెయిలీకి గతేడాది వివాహం జరిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే వారి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకొన్నట్టు సమాచారం. దాంతో బీబర్ మ్యారేజ్ కౌన్సిలింగ్‌కు హాజరవుతున్నారట. ఈ నేపథ్యంలో బీబర్ మార్చి 9న ‘నేను చాలా కష్టాల్లో ఉన్నాను' అంటూ ట్వీట్ చేయడం మరింత చర్చనీయాంశమైంది.

డిప్రెషన్‌కు గురయ్యాను
నేను వ్యక్తిగతంగా కొన్ని సమస్యల్లో ఉన్నాను. త్వరలోనే వాటి నుంచి బయటపడుతాను. డిప్రెషన్‌కు ట్రీట్‌మెంట్ తీసుకొంటున్నాను. పూర్తిగా మానసికమైన ఆరోగ్యంతో బయటకు వస్తానని బీబీర్ తన సన్నిహితులకు వెల్లడించినట్టు సమాచారం.

ఆందోళనలో నా కుటుంబం
తాను మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు బీబర్ గత ఫిబ్రవరిలో వెల్లడించడంతో సంగీత ప్రపంచం షాక్ గురైంది. నా జీవితం గురించి నా తల్లి కూడా ఆందోళనకు గురవుతున్నది. నా కుటుంబం అంతా టెన్షన్‌లో ఉన్నారు. త్వరలోనే నేను మానసికంగా, శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తాను అని బీబీర్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











