అది నకలీ ఎక్కౌంట్..నమ్మొద్దు : కాజల్ రిక్వెస్ట్
ఆ ట్విట్టర్ నాది కాదు...నా పేరుతో ఎవరో ట్వీట్ చేస్తున్నారు. నాకు ఏ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో ఎకౌంట్ లేదు. అది నకిలీ ఎకౌంట్ అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ఈ మధ్య రోజుకో ఫేక్ ట్విట్టర్ ఎక్కౌంట్ బయిటపడుతోంది. అందులో అసలు సెలబ్రీటిలకు సంభంధం లేకుండా ఆ ఎక్కౌంట్ ఓపెన్ చేసిన వారు నోటికొచ్చినట్లు రాసేస్తున్నారు. ఆ మధ్య త్రిష, దిల్ రాజు, రీసెంట్ గా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ నకిలీ ట్విట్టర్ ఎక్కౌంట్ ల బారిన పడ్డారు. ఇక కాజల్ నటించిన బృందావనం నిన్న గురువారం రిలీజైంది. అలాగే ప్రభాస్ సరసన ఒక సినిమా, రామ్‌చరణ్‌తో మెరుపు , రవితేజతో వీర, నాగచైతన్యతో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉంది కాజల్.
కాజల్ బృందావనం ఫేక్ ఎక్కౌంట్ ట్విట్టర్ నాగచైతన్య జూ ఎన్టీఆర్ kajal brindavanam fake account twitter nagachaitanya jr ntr


Click it and Unblock the Notifications