Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రిష అలా... కాజల్ ఇలా.. ఇద్దరు భామలతో కొరటాలకు షాకులే..
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం నుంచి హీరోయిన్ త్రిషా బయటకు వెళ్లిపోవడం టాలీవుడ్లో భారీ చర్చకు తెరతీసింది. చిన్న చితకా హీరో సినిమాలో అయితే ఇది పెద్దగా పట్టించకొనే విషయం కాదు. కానీ చిరంజీవి లాంటి మెగా ప్రాజెక్టు విషయంలో ఇది జరగడంతో అనేక సందేహాలు లేచాయి. అయితే త్రిష తప్పుకోవడానికి ప్రధాన కారణాలంటూ మీడియాలో కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కాజల్‌తో కొరటాలకు మరో సమస్య తలెత్తిందనే మాట వినిపిస్తున్నది.. ఇంతకు ఆ విషయాలు ఏమింటే..
సింగిల్ హీరోయిన్ అని చెప్పి
చిరంజీవితో త్రిష నటించడానికి ఒప్పుకోవడానికి, అగ్రిమెంట్ సైన్ చేయడానికి ముందు.. ఆచార్యలో సింగిల్ హీరోయిన్ అని దర్శక, నిర్మాతలు చెప్పినట్టు సమాచారం. అయితే కథలో మార్పులు, కొన్ని రకాలు అంశాలు ప్రాజెక్టులోకి రావడంతో రెండో హీరోయిన్ కూడా తెరపైకి రావడం త్రిషకు నచ్చలేదని అందుకే ఆమె తప్పుకొన్నారనే విషయం చర్చనీయాంశమైంది.
రాంచరణ్ రంగ ప్రవేశంలో
తొలుత ఆచార్య చిత్రంలో ఓ యువ నాయకుడి పాత్ర కోసం మహేష్ బాబు చేస్తున్నారనే విషయం వార్తల్లోకి ఎక్కింది. అయితే మెగా క్యాంపు ఒత్తిడి మేరకు రాంచరణ్ ఆ పాత్రను చేస్తున్నారని, ఆయన కోసం మరో హీరోయిన్ను తెరపైకి తెచ్చారని.. మరో హీరోయిన్ రావడం త్రిషాకు నచ్చకపోవడం వల్లే ఆమె తప్పుకొన్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది.
రెమ్యునరేషన్ తేడాలు కూడా
అయితే ఆచార్యకు ప్రాజెక్టును ఒప్పుకోవడానికి ముందు ఒప్పుకొన్న రెమ్యునరేషన్లో తేడాలు వచ్చాయని, ఆ విషయంలో చిత్ర యూనిట్‌కు తనకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే త్రిష ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నట్టు తెలిసింది. అయితే తిష్ర తప్పుకోవడానికి అటు చిత్ర యూనిట్ స్పందించకపోవడం గమనార్హం.
Recommended Video
కాజల్ గొంతెమ్మ కోరికలు
ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి ఉన్న ఓ ప్రాజెక్ట్ నుంచి ఓ హీరోయిన్ వైదొలగడమనేది ఇండస్ట్రీలో ఇప్పటి వరకు జరుగలేదు. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో త్రిష వ్యవహారం ముదిరి పాకాన పడింది. త్రిష స్థానంలో వచ్చిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. కాజల్ నుంచి వచ్చిన కోరిక ప్రస్తుతం నిర్మాతలను సందిగ్ధంలో పడేసినట్టు తెలుస్తున్నది.