కాజల్ ప్రేమలో పడిందనే డౌట్..ఎందుకంటే
"ఏదో వయసొచ్చింది కదా...ప్రేమిస్తే పోలా...అని ప్రేమించేయకూడదు. అది మనసుకి సంబంధించిన విషయం. వయసుతో పనిలేదు. మనసుకి నచ్చినవాడు కనిపించాలి. తన అభిరుచులు నాకూ నచ్చాలి. అప్పుడే ప్రేమ. దానికి కంగారేం లేదు" అంటోది కాజల్. మగధీరతో తెలుగులో బిజీ స్టార్ గా మారిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రేమ పాఠాలు వల్లిస్తోంది. అయితే తను ఎవరినీ ప్రేమించలేదని చెప్తోంది. "ప్రేమ...అంత తీరిక ఎక్కడ ఉందండీ. మీరు చూస్తూనే ఉన్నారుగా. కంటినిండా కునుకు తీయడానికే వీలు కావడం లేదు. చేతినిండా సినిమాలున్నప్పుడు ప్రేమ గురించి ఆలోచించేందుకే సమయం చిక్కడం లేదు" అనేసింది. ఒకవేళ ఖాళీ దొరికితే ప్రేమిస్తారా? అని అడిగితే పై విధంగా శెలివిస్తోంది. అంటే ఆమె తన మనస్సులో ఎవర్నో పెట్టుకుని ఇలా మాట్లాడుతోందని అర్దం చేసుకోవాలా అని కొందరి డౌట్.ప్రస్తుతం కాజల్...ఎన్టీఆర్ సరసన బృందావనం, ప్రభాస్ సరసన ఓ చిత్రంలోనూ చేస్తోంది. తాజాగా మహేష్ సరసన కూడా ఆఫర్ సంపాదించిందని సమాచారం.


Click it and Unblock the Notifications











