Kalki 2898 AD కల్కి 2898 ఏడీ మేకర్స్‌ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? ఫ్యాన్స్‌లో ఆందోళన
ఇప్పుడు ఉన్న ట్రెండీ ప్రపంచంలో సినిమా అనేది ఒక ప్రప్రథమ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ గా మారింది. మరోపక్క ఓటిటి కూడా బాగా పాపులర్ అవుతుండడంతో బిగ్ స్క్రీన్ సినిమాలు తీసేవారికి అది మరింత ఛాలెంజింగ్ గా మారుతూ వస్తుంది. ఇంకో పక్క ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ మారడం ఇందులో మన తెలుగు సినిమాలు ఇందులో ప్రముఖ పాత్ర పోషించడం ఒక రకంగా మనకి గర్వకారణం.
కానీ అసలు ఇంత క్రేజ్ ఉన్న సినిమాలు ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం అనేది కూడా ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా ముఖ్యం. ఎంత బిగ్ స్టార్ సినిమా అయినప్పటికీ ఆ సినిమాని ప్రేక్షకుల్లోకి చొచ్చుకునేలా నాటడం కూడా చాలా ముఖ్యం. ఏదో అరకొర ప్రమోషన్స్ చేసినా అది ఖచ్చితంగా తర్వాత చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.

సరిగ్గా ఇదే మిస్టేక్ ని అవైటెడ్ పాన్ ఇండియా సినిమా "కల్కి 2898 ఎడి" మేకర్స్ చేస్తున్నారు. సుమారు 600 కోట్లకి పైగా బడ్జెట్ సినిమా కోసం వెచ్చించారు. దాదాపు ఇండియా లోని అగ్ర తారాగణం ఈ సినిమాలోనే ఉంది. ఇలాంటి ఎలిమెంట్స్ ఉంచుకొని కూడా ఓ కార్ మీద మాత్రమే ప్రమోషన్స్ కి ఆధారపడటం బాధాకరం.
తలుచుకుంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు సాలిడ్ ప్రమోషన్స్ ని మేకర్స్ చేయవచ్చు. కానీ ఎందుకో చిత్ర బృందం ఇవేవి చేయడం లేదు. మైథలాజి, సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేసిన సినిమా ఇది. చేయాలి అనుకుంటే చాలా చేయొచ్చు కానీ చివరి 10 రోజుల్లో పెద్దగా ప్రమోషన్స్ ఎక్కడా కనిపించడం లేదు.

సరే ప్రభాస్ కి భారీ క్రేజ్ ఉంది మన తెలుగు స్టేట్స్ వరకు ఓకే కానీ మొగత స్టేట్స్ లో కూడా ప్రమోషన్స్ కనిపించడం లేదు. ఆ మధ్య సినిమా సూపర్ సోల్జర్స్ తో ఇండియా అంతా అక్కడక్కడా తిప్పించారు. దాంతో అప్పట్లో అబ్బో అనుకున్న వారంతా ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. సినిమాకి ప్రమోషన్స్ చేయకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా డిజప్పాయింట్ అవుతున్నారు.
ఎలాంటి సినిమాని ఎలా జనాల్లోకి తీసుకెళ్తున్నారని బాగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒక అప్డేట్ ని టైం ని అందించరు. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో డీల్ చేయడం కూడా ఓవర్ గా మారిపోయింది. వీటి అన్నిటి ప్రభావం చివరగా ప్రభాస్ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ మీద సినిమా వసూళ్ల మీదనే తప్పకుండా పడుతుంది.

ఒక మంచి ప్రోడక్ట్ చేసినపుడు దానిని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లామా అనేది కూడా చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ నే కనిపిస్తుందని చాలా మంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సినిమా మీద ప్రభావం చూపుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











