Lal Salaam మూవీలో కపిల్ దేవ్.. క్రికెట్ లెజెండ్‌తో నటించడం అంటూ రజనీకాంత్ ట్వీట్!
సూపర్ స్టార్ రజినీకాంత్ 70 ఏళ్ల వయసులో కూడా వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్ సలామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ముంబై మాఫియా కథా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుపుకొంటున్నది.
ఈ క్రమంలో లాల్ సలామ్ సినిమా యూనిట్‌తో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ భాగం కావడం సినీ, క్రికెట్ అభిమానులను సంతోషానికి గురిచేసింది. లాల్ సలామ్ సినిమా, కపిల్ దేవ్ గురించి రజనీకాంత్ చేసిన కామెంట్ గురించిన విషయంలోకి వెళితే..

ముంబై మాఫియా డాన్ కథతో: ముంబైని ఓ దశలో గడగడలాడించిన మోయిద్దీన్ భాయ్ కథగా లాల్ సలామ్ తెరకెక్కుతున్నది. ముంబైలో మాఫియా సామ్రాజ్యాన్ని నెలకొల్పి పోలీసులకు సవాల్‌గా నిలిచిన డాన్ కథను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. చిత్రంలోని ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కీలక పాత్రలో కపిల్ దేవ్: ఇక లాల్ సలామ్ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం కపిల్ దేవ్‌ను రంగంలోకి దించినట్టు సమాచారం. ఈ సినిమాకు బలంగా మారే ఓ పాత్రను కపిల్ దేవ్‌కు వివరించగా.. అందుకు ఆయన సమ్మతించడంతో లాల్ సలామ్ ప్రాజెక్టులోకి ఆయన అడుగుపెట్టారు. ఇటీవల ముంబైలో కొన్ని ప్రధాన సన్నివేశాలను కపిల్, రజనీకాంత్‌పై చిత్రీకరించినట్టు సమాచారం. కపిల్ దేవ్‌తో ఉన్న ఫోటోను రజనీకాంత్ షేర్ చేసి ఆనందాన్ని నింపారు.

కపిల్ దేవ్‌తో పనిచేయడం: ఇక కపిల్ దేవ్ ఫోటోను రజినీకాంత్ షేర్ చేసి.. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌తో పనిచేయడం గొప్ప అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. భారత్‌కు తొలిసారి ప్రపంచకప్‌ను సాధించి పెట్టిన కపిల్ దేవ్ జీ లాంటి మానవత్వం ఉన్న వ్యక్తి, నాకు ఎంతో గౌరవం ఉన్న వ్యక్తితో పనిచేయడం సంతోషం కలిగించింది అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.
రజనీకాంత్ గుడ్ బై అంటూ: ఇదిలా ఉండగా, రజనీకాంత్ త్వరలోనే నటనకు గుడ్‌బై చెప్పేందుకు సిద్దమవుతున్నారనే విషయం మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల దర్శకుడు, నటుడు మిస్కిన్ ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ దర్వకత్వంలో నటించే చిత్రమే రజినీకాంత్‌కు చివరి సినిమా. తన చివరి సినిమాకు దర్శకత్వం వహించమని లోకేష్‌ను తలైవా అడిగారనే విషయాన్ని మిస్కిన్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











