twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరాటే కల్యాణి కిడ్నాప్? అజ్ఞాతంలో సినీ నటి.. చిన్నారి అక్రమ దత్తతలో కొత్త ట్విస్ట్

    |

    సినీ నటి కరాటే కల్యాణి వ్యవహార తీరు మరో మలుపు తిరిగింది. య్యూట్యూబర్ శ్రీకాంత్‌తో వివాదం కొత్త టర్న్ తీసుకోవడమే కాకుండా ఈ కాంట్రవర్సీ ఆమె మెడకు బలంగా చుట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. చిలికి చిలికి గాలి వానగా మొదలైన శ్రీకాంత్, కరాటే కల్యాణి వివాదం రకరకాల ట్విస్టుకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ క్రమంలో కరాటే కల్యాణి తల్లి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కరాటే కల్యాణి తల్లి చేసిన వ్యాఖ్యలు ఏమిటి? కరాటే కల్యాణి అదృశ్యం వెనుక ఏం జరిగిందనే విషయాల్లోకి వెళితే..

    Recommended Video

    Karate Kalyani Vs Sreekanth Reddy Controversy పూర్తి వివరాలు | Telugu Filmibeat
    యూట్యూబర్‌తో కరాటే కల్యాణి గొడవ

    యూట్యూబర్‌తో కరాటే కల్యాణి గొడవ

    శుక్రవారం అర్ధరాత్రి కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి మధ్య గొడవ తర్వాత మీడియాలో పలు రకాల కథనాలు వినిపించాయి. కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకొని కేసులు నమోదు అయ్యేలా చేసుకొన్నారు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకొన్నారు. శ్రీకాంత్‌, కరాటే కల్యాణి కొట్టుకొన్న సమయంలో ఓ చిన్నారి వివాదంలో కేంద్ర బిందువు అయింది.

    కరాటే కల్యాణి ఇంటిలో సోదాలు

    కరాటే కల్యాణి ఇంటిలో సోదాలు

    అయితే శ్రీకాంత్‌తో వివాదం కొనసాగుతున్న సమయంలో కరాటే కల్యాణి ఇంటిలో తెలంగాణ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులు మెరుపుదాడులు చేశారు. చిన్నారి కోసం సోదాలు నిర్వహించారు. దాంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. అయితే కరాటే కల్యాణిపై కొత్త ఆరోపణలు వచ్చాయి. చిన్నారిని ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఎక్కడి నుంచో తెచ్చుకొన్నదనే ఆరోపణలు రావడం సంచలనంగా మారాయి.

    1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు

    1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు

    కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారులను తీసుకొచ్చి పెంచుకొంటున్నారని 1098 టోల్ ఫ్రి నంబర్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. పలువురు చిన్నారులను కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. సోదాల సమయంలో ఇద్దరు చిన్నారులను పోలీసులు, అధికారులు గుర్తించారు. కరాటే కల్యాణి మూడు నెలల చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకొన్నారని, చట్టవ్యతిరేకంగా తీసుకొచ్చారు అని అధికారులు తెలిపారు.

    కరాటే కల్యాణిని కిడ్నాప్?

    కరాటే కల్యాణిని కిడ్నాప్?

    అయితే కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో ఆమె లేకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అయితే కరాటే కల్యాణిని ఎవరైనా కిడ్నాప్ చేశారమో అనే అనుమానాలను ఆమె తల్లి విజయలక్ష్మి వ్యక్తం చేసింది. తన కూతురుకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్‌లో ఉంది. ఫోన్‌ ఎక్కడైనా పాడేశారో లేదా.. సిగ్నల్ లేకపోవడం వల్ల అందుబాటులో లేనట్టు ఉందనే విషయన్ని కరాటే కల్యాణి తెలిపింది.

    అక్రమంగా మూడు నెలల పాపను దత్తత

    అక్రమంగా మూడు నెలల పాపను దత్తత

    కరాటే కల్యాణి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల మూడు నెలల పాపను తీసుకొచ్చింది. చిన్నారిని పెంచి పోషించే శక్తి లేకపోవడం వల్ల ఆ పాపను మాకు ఇచ్చారు. అయితే దత్తత విషయంలో ఇన్ని రూల్స్ ఉంటాయని మాకు తెలియదు అని తల్లి విజయలక్ష్మి తెలిపారు. ఆదివారం నుంచి కల్యాణి ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. తన కూతురును బెదిరించిన శ్రీకాంత్ రెడ్డి ఏమైనా కిడ్నాప్ చేశారా అనే అనుమానాన్ని కరాటే కల్యాణి తల్లి వ్యక్తం చేసింది.

    పిలల్ని కలెక్టరేట్‌లో అప్పగించాలని

    పిలల్ని కలెక్టరేట్‌లో అప్పగించాలని

    ఇదిలా ఉండగా, కరాటే కల్యాణి ఇంట్లో ఉన్న చిన్నారి, మరో బాబును కలెక్టరేట్‌లో అప్పగించాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే తన కూతురు ఆచూకీ లేదు. తన కూతురు బతికి ఉందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతున్నది. కరాటే కల్యాణి వచ్చిన తర్వాత బాబును తీసుకొని కలెక్టరేట్‌కు వెళ్తామని తల్లి విజయలక్ష్మి తెలిపారు.

    English summary
    Karate Kalyani's contraversy with Srikanth Reddy takes another leap. Child welfare officers and Telangana Police made rides on Karate Kalyani's home. In this occassion, Her mother made sensational allegations on Srikanth Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X