టాలీవుడ్‌కు మరోసారి కత్రినా కైఫ్.. . ఆ ఇద్దరు స్టార్ హీరోలతో రొమాన్స్‌కు గ్రీన్ సిగ్నల్

పాన్ ఇండియా మూవీస్‌తో బాలీవుడ్ హీరోలకు ధీటుగా హీరోలు ప్రభాస్, విజయ్ దేవరకొండ రాణిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ముంబైలో అడ్డా పెట్టి తమ ప్రాజెక్టులను సెట్ చేసుకొంటున్నారు. విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో, ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంతో బాలీవుడ్‌లో తమ ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి హీరోలతో కత్రినా కైఫ్ జత కట్టనున్నారనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎద అందాలు ప్రదర్శిస్తున్న సాక్షి అగర్వాల్.. యువ హీరోయిన్ ఆ విషయంలో తగ్గట్లేదే

 ప్రభాస్‌తో బాలీవుడ్ దర్శకుడి మూవీ

ప్రభాస్‌తో బాలీవుడ్ దర్శకుడి మూవీ

బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి చిత్రాలను రూపొందించిన బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. ప్రభాస్‌ కూడా ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును ఇప్పటికే లాక్ చేశారు అని బాలీవుడ్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.

 దీపిక తర్వాత కత్రినా కైఫ్‌తో ప్రభాస్

దీపిక తర్వాత కత్రినా కైఫ్‌తో ప్రభాస్

అయితే సిద్దార్త్ ఆనంద్, ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందే సినిమా కోసం కత్రినా కైఫ్‌ను ఫైనల్ చేశారు. ఆమె కూడా ప్రభాస్ పక్కన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ప్రచారంలో ఉంది. దీంతో ఇప్పటికే శ్రద్దా కపూర్ జతకట్టిన ప్రభాస్ .. తన తదుపరి చిత్రంలో దీపికా పదుకోన్‌తోపాటు కత్రినాతో జతకట్టడం ఇప్పడు హిందీ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

 విజయ్ దేవరకొండతో కత్రినా కైఫ్

విజయ్ దేవరకొండతో కత్రినా కైఫ్

అయితే ప్రభాస్‌ సినిమాకు ఒకే చెప్పిన కత్రినా కైఫ్.. విజయ్ దేవరకొండతో కూడా ఓ సినిమా చేసేందుకు సిద్దమయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. త్వరలోనే బిగ్‌ స్క్రీన్‌పై ఈ ఇద్దరు రొమాన్స్ చేయడానికి సిద్దపడుతున్నారని విషయం బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది.

ప్రభాస్‌తో ముందా? లేదా విజయ్ దేవరకొండతోనా

ప్రభాస్‌తో ముందా? లేదా విజయ్ దేవరకొండతోనా

అయితే ముందు ప్రభాస్‌తో రొమాన్స్ చేస్తుందా లేదా విజయ్ దేవరకొండతో హాట్ హాట్‌గా నటిస్తుందా అనేది విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ హీరోలతో కత్రినా జతకట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వెంకటేష్‌తో మళ్లీశ్వరీ చిత్రంలో, బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Recommended Video

Katrina Kaif Showers Praises On Lady Superstar Nayanthara
బాలీవుడ్‌లో ప్రభాస్, విజయ్ దేవరకొండ

బాలీవుడ్‌లో ప్రభాస్, విజయ్ దేవరకొండ

యంగ్ రెబల్ స్టార్ విషయానికి వస్తే.. ప్రభాస్‌ బాలీవుడ్‌లో ఆదిపురుష్‌తోపాటు నాగ్ అశ్విన్‌తో రెండు సినిమాలను లైన్‌లో పెట్టారు. ఇక ప్రశాంత్ నీల్‌తో కలిసి సలార్ సినిమాతో పాన్ ఇండియా మూవీతో రెడీ అవుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. లైగర్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X