»   » ఆ సెంటిమెంట్ వర్క్అవుట్ అవుతుందా...? జనతా గ్యారేజ్ సూపర్ హిట్ ఖాయమా....?

ఆ సెంటిమెంట్ వర్క్అవుట్ అవుతుందా...? జనతా గ్యారేజ్ సూపర్ హిట్ ఖాయమా....?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ ఈ సారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. టెంపర్ , నాన్నకు ప్రేమతో అంటూ వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాల తర్వాత ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జనతా గ్యారేజ్ తో మరో హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ఈ మూడో సినిమా కూడా హిట్ ఖాయం అంటున్నారు.

కొరటాల శివ డైరెక్షన్ లో మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12 న విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించేశారు. కొరటాల శివ - ఎన్టీఆర్ ల కాంబినేషన్ ఇప్పుడు సంచలనం గా మారింది. ఈ సినిమా బంపర్ హిట్ అవుతుంది అని ఒక కొత్త సెంటిమెంట్ ని చెబుతున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. అదేంటంటే........

Is Kerala sentiment will helps for janatha garage success

ఎన్టీఆర్ సింహాద్రి అనే బ్లాక్ బస్టర్ గుర్తుంది కదా.. ఆ సినిమా కి సంబంధించిన కీలక సన్నివేశాలు అన్నీ కేరళ లో చిత్రీకరణ జరిపారు. ఆ తరవాత ఎన్టీఆర్ ఏ సినిమా కీ కేరళ వెళ్ళలేదు. సో జనతా గ్యారేజ్ కోసం ఇప్పుడు ఇన్నాళ్ళ తరవాత కేరళ వెళుతున్నాడు.

ఈ సినిమా కూడా కేరళ లో షూటింగ్ జరపడం తో ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుంది అనే సెంటిమెంట్ ని ఫిక్స్ అయ్యారట ఎన్టీఆర్ ఫాన్స్. ఆ సినిమా సెంటిమెంట్ ని జనతా గ్యారేజ్ కి ఆపాదించి సూపర్ హిట్ అయ్యి తీరుతుంది అంటున్నారు. అసలే మంచి అంచనాలతో ఉన్న జనతా గ్యారేజ్ కి ఈ సెంటిమెంట్ టాక్ కూడా తోడైతే తారక్ ఖాతాలో హ్యాట్రిక్ పడ్డట్టే...

English summary
Kerala sentiment works out for this Time for janatha garage.. says junior's fans
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu