మహేష్ ఖలేజా పై కొమురం పులి చావు దెబ్బ కొట్టనుందా?
మహేష్ బాబు తాజా చిత్రం ఖలేజా పై పవన్ కళ్యాణ్ కొమురం పులి చిత్రం పెద్ద దెబ్బ కొట్టనుందని వినపడుతోంది. కారణం...రెండు చిత్రాలకు నిర్మాత ఒకరే శింగనమల రమేష్ కావటమేనని చెప్తున్నారు. ఈ నెల 30 న రిలీజ్ కానున్న ఖలేజా చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తీసారు. అనుకున్న బడ్జెట్ దాటటంతో నిర్మాణ వ్యయం కంట్రోలు చేయటానికి సి.కళ్యాణ్ ని రంగంలోకి దించారు. అయినే పెద్దగా తేడారాలేదని,నిర్మాతగా చాలా ఖర్చు పెట్టించారని అంటున్నారు. అయితే పులి భారీ బడ్జెట్టుతో రంగంలోకి దూకి గర్జించలేక చతికిలపడటం జరిగింది. దాంతో పులి చిత్రం కొనుక్కున్న వారు దాదాపు నూటికి తొంభై మంది నష్టపోవటం కన్ఫర్మ్ అని తేలిపోయింది. దాంతో వారంతా రమేష్ తాజా చిత్రం ఖలేజా ద్వారా తమని రికవరి చేసి ఒడ్డున పడేయమని కోరుతున్నారని సమాచారం. అదే కనుక జరిగితే ఖలేజా ఏమన్నా వర్కవుట్ అయితే ఒడ్డున పడదామని ఆశలు పెట్టుకున్న శింగనమల రమేష్ కి ఏమీ మిగలదంటున్నారు. మరో ప్రక్క ఖలేజా చిత్రం కూడా పెద్ద హిట్టయితే తప్ప బయిటపడే ఛాన్స్ లేదని విమర్శలు వినపడుతున్నాయి. తెలుగు సినిమా స్టామినాని దాటి ఖర్చు పెడితే లాభాలు మాట కాకుండా నష్టాలు లేకుండా బయిటపడటమే కష్టమంటున్నారు.ఈ పరిస్ధితుల్లో మహేష్, త్రివిక్రమ్ ఏం చేయనున్నారో చూడాలి. ఒకర్నొకరు పొడుడుకుంటున్న వీరిద్దరూ నిర్మాతను సేవ్ చేస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











