గొడవకు కారణం కృష్ణవంశీనే
ఈ మధ్య కాలంలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఎక్కువగా పరభాషా నటులు ప్రధాన్యం తగ్గలంటూ చెప్పుతున్నారు. అయితే ఆయన మాటలు చాలా సార్లు ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేస్తున్నాయని మీడియాలో వినపడుతోంది. దీనిని మీడియా వారు ఆయన ముందు ఉంచగా ఆయన దాన్ని కొట్టిపారేశారు. ఆయన మాటల్లోనే...అసలు ఈ గొడవలోకి ప్రకాష్‌రాజ్ పేరు రావడానికి కారణం దర్శకుడు కృష్ణవంశీ. ఇటీవలే తను మీడియా ముందు మాట్లాడుతూ 'తెలుగులో ఆర్టిస్టులు లేరు. దానికి నిదర్శనమే ఈ ఏడాది ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ విలన్ రెండు నందులు ప్రకాష్‌రాజ్‌కి రావడం" అన్నారు. అది నాక్కూడా బాధ అనిపించింది. మన తెలుగు నిర్మాతల విషయంలో కొందరు పరభాషా నటుల ప్రవర్తన చూసి బాధ అనిపించి, నేను మాట్లాడుతుంటాను తప్ప ప్రకాష్ రాజ్‌ని ఉద్దేశించి కాదు అన్నారు.
అలాగే అయినా ప్రకాష్ రాజ్ నా సోదరుడు లాంటివాడు. నన్ను 'అన్న" అని ప్రేమగా పిలుస్తాడు. మీ అభిమాన నటుడు ఎవరని తనను అడిగితే అతను చెప్పే పేరు కూడా నాదే. చాలా సందర్భాల్లో తాను పోషించిన పాత్ర చూసి, ఆ పాత్ర నాకెందుకు రాలేదా... అని నేను ఈర్ష్య పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అన్నారు. అయినా నన్ను విలన్‌గా పెడతారు. నా కూతుర్ని బొంబాయి నుంచి దించుతారు. నా కోడుకునేమో మలయాళం వాడ్ని పెడతారు. అర్థంపర్థం ఉండొద్దా అండీ.. చూడ్డానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అని సూటిగా అడిగారు.


Click it and Unblock the Notifications











