'వేదం' క్రిష్ ఆ సెంటిమెంట్ గండం దాటగలరా?
'గమ్యం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్సకుడు క్రిష్. మొదటి చిత్రంతోనే కమర్షియల్ గానేకాక, విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్నారు. ఆయన రెండో చిత్రం 'వేదం' రేపు(మే 4, శుక్రవారం) రిలీజవుతోంది. అయితే రెండో చిత్రం గండం అనే సెంటిమెంట్ తెలుగులో ఉంది. రాజమౌళి వంటి వారు తప్ప దాదాపు ఈ సెంటిమెంట్ ను దాటిన వాళ్ళు లేరనే చెప్పాలి. బోయపాటి శ్రీను తులసితో ఈ గండం దాటాడన్నారు కానీ కొందరు ఒప్పుకోరు. రీసెంట్ గా రామ రామ కృష్ణ కృష్ణ దర్శకుడు శ్రీవాస్...నేను రెండో చిత్రం గండం తప్పాను అని స్టేట్ మెంట్ ఇచ్చాడు. గండం తప్పించుకున్నాడా...లేక అలా బిల్డప్ కు చెప్తున్నాడా అనే విషయం ప్రక్కన పెడితో ఈ నమ్మకం అంతటా ఉంది. దాంతో క్రిష్ ద్వితీయ ప్రయత్నంకి ఈ సెంటిమెంట్ ఎంతవరకూ పనిచేస్తుంది అన్న విషయం తేలాల్సి ఉంది. గమ్యం వంటి మంచి చిత్రంతో హిట్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి ఈ చిత్రం కూడా ప్రయోగం కాబట్టి ఈ గండం దాటితే బాగుండునని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











