Marriage: డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి.. కాబోయే భార్య ఎవరో తెలుసా?
ప్రముఖ దర్శకుడు, నిర్మాత క్రిష్ జాగర్లమూడి మరోసారి పెళ్లికి సిద్దమవుతున్నాడనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అధికారికంగా ఆయన నుంచి గానీ. ఆయన ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా ఈ వార్త వైరల్ అవుతున్నది. అయితే గతంలో తన మొదటి భార్యతో విడాకులు తీసుకొన్న తర్వాత ఆయన కొంతకాలంగా ఒంటరిగా ఉన్నప్పటికి.. తాజాగా రెండో పెళ్లి వార్త హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన పెళ్లి ఎప్పుడు? ఎవరితో అనే వివరాల్లోకి వెళితే..
గమ్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన క్రిష్ జాగర్లమూడి ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించాడు. వేదం, కృష్ణం వందే జగద్గురు, గబ్బర్ ఈజ్ బ్యాక్, గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక, మణికర్ణిక, కొండపొలెం, హరిహర వీర మల్లు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం కొండపొలెం 2021లో వచ్చింది. అప్పటి నుంచి ఆయన సినిమాలు రాలేదనే విషయం తెలిసిందే.

అయితే సినిమా జీవితం బాగానే ఉన్న తన తొలి వివాహంలో కలతలు చోటు చేసుకొన్నాయి. ఆయన మొదటి వివాహం 2016 ఆగస్టు 7వ తేదీన రమ్య అనే డాక్టర్‌ను వివాహం చేసుకొన్నారు. అయితే ఆయన దాంపత్య జీవితం సజావుగా సాగుతుందని అనుకొన్న సమయంలోనే ఆయన వైవాహిక జీవితంలో భార్యతో అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తప్పలేదు. రెండేళ్ల వ్యవధిలోనే రమ్యతో ఆయన డైవోర్స్ తీసుకొన్నారు.
క్రిష్ మొదటి వివాహనికి ముందు.. తర్వాత ఆయనకు ఓ హీరోయిన్‌తో రిలేషన్‌షిప్ ఉందనే ప్రచారం జరిగింది. హీరోయిన్‌తో అఫైర్ కారణంగానే విడిపోయారనే ఊహాగానాలు మీడియాలో కనిపించాయి. అయితే వాటికి అంతగా ప్రాధాన్యం లేకపోవడం, వాస్తవాలు లేకపోవడంతో ఆ రూమర్లుగానే ఉండిపోయాయి. ఆ తర్వాత ఆయన అఫైర్ గురించి గాసిప్స్ వచ్చినప్పటికీ.. అవి అలాగే ఉండిపోయాయి.

అయితే తాజాగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి హైదరాబాద్‌కు చెందిన గైనకాలజిస్టును వివాహం చేసుకోనున్నారు. నవంబర్ 10వ తేదీన ప్రితీ చల్లా అనే వైద్యురాలి మెడలో మూడు మూళ్లు వేయనున్నారు. ఆ తర్వాత నవంబర్ 16వ తేదీన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సినీ ప్రముఖులకు విందు ఏర్పాటు చేయనున్నారు అనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది.
ఇదిలా ఉండగా, అనుష్క శెట్టి హీరోయిన్‌గా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం గాతి అనే చిత్రం ఇటీవల రిలీజై ట్రెండింగ్‌లో ఉంది. అనుష్కతో ఇది రెండో చిత్రం కావడం గమనార్హం. ఆయన గతంలో వేదం సినిమా కోసం పనిచేశారు. అనుష్కతో రూపొందిస్తున్న గాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











