మహేష్ బాబుకు కొత్త భామ ‘క్రితి సానన్’ కరెక్టేనా?
హైదరాబాద్: మహేష్ బాబు-సుకుమార్ సినిమా ద్వారా క్రితి సానన్ అనే కొత్త అమ్మాయి పరిచయం అవుతోందని ఇప్పటికే పాఠకుల దృష్టికి తీసుకొచ్చాం. మరి మహేష్ బాబు సరసన ఈ కొత్త అమ్మాయి సెట్టవుతుందా? ఇప్పటి వరకు నటనలో అనుభవం లేని క్రితి సానన్‌ను మహేష్ బాబు లాంటి పెద్ద హీరోతో చేయించడం ఎంత వరకు కరెక్ట్ అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే విశ్లేషకులు మాత్రం అందం పరంగా, హైట్ పరంగా క్రితి సానన్ మహేష్ బాబుకు తగిన జోడీ అంటున్నారు. 5"10 అడుగుల పొడవున్న క్రితి మహేష్‌కు ఈడు జోడులా ఉంటుందని, ఆమె అందచందాలు టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని అంటున్నాయి.
నటన పరంగా చూస్తే...ఆమె నటించిన పలు యాడ్ ఫిల్మ్‌లో క్రితి సానన్ హావభావాలు భాగానే ఉన్నాయని, సుకుమార్ లాంటి దర్శకుడు కావడంతో ఆమె నటన విషయంలో మరింత పరణితి చెందే అవకాశం ఉందని అంటున్నారు. మరి క్రితి సానన్ అదృష్టం ఎలా ఉందో సినిమా విడుదలైతే గానీ తెలియదు.
మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్ర తరువాత షెడ్యూల్ అక్టోబర్ 10 నుండి గోవాలో మొదలు కానుంది. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు. ఇందుకోసం అయన అమెరికా నుండి ప్రత్యేకంగా ట్రైనర్ ని కూడా తెచ్చుకున్నారు. ఈ చిత్రం 2013 వేసవికి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












