Don't Miss!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
ఆ ఫార్మట్ తెలియకే బాలీవుడ్ మిస్ చేసుకొన్న లారెన్స్...!?
రీమేక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరో తెలుగు సినిమాపై మనసు పారేసుకున్నాడు. తాజాగా 'బాడీగార్డ్" సినిమాతో పెద్ద హిట్టు కొట్టిన సల్మాన్, ఇప్పుడు 'కాంచన" సినిమా రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ రూపొందిన 'కాంచన"చిత్రాన్ని హిందీలో తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించనున్నారు. సల్లూభాయ్ నటిస్తొన్న ఈ చిత్రానికి ఆయన సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఎక్తా టైగర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం చిత్రీకరన పూర్తి అవ్వగానే 'కాంచన" సెట్స్ కు వెళ్ళనుందని హీరో సల్మాన్ ఖాన్ తెలియజేసారు.
హిందీలో రీమేక్ కానున్న ఈ చిత్రాన్ని 3డి ఫార్మెట్ లో చేయబోతున్నారట. ఆ ఫార్మెట్ గురించి అవగాహన లేక, 'ముని-3" కథను రెడీ చేస్తూ బిజీగా ఉండటం వల్ల లారెన్స్ ఈ హిందీ సినిమాకి దర్శకత్వం వహించడం లేదని సమాచారం జరుగుతోంది. మరి తెలుగు, తమిళ భాషల్లో హర్రర్ చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కాంచన హిందీలో 3డి ఫార్మాట్ లో రూపొందనున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం లారెన్స్ తెలుగులో ప్రభాస్ హీరోగా 'రెబల్" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే..