For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ బాబు సినిమా చేతులు మారింది.,పీవీపి కి హ్యాండివ్వటమా? లేకా....!!??

  |

  మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మూవీ మీద అందరూ ఎంతో హోప్ పెట్టుకున్నారు. కానీ అనుకున్న అంచనాలకు ఆ సినిమా చేరలేకపోయింది. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అనుకున్న విధంగా ఈ సినిమా హిట్ కానందుకు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలను తప్పు పట్టవద్దన్నాడు మహేష్ బాబు. ఈ మూవీ ఫ్లాప్ లో తన తప్పు ఉందని పెద్దమనసుతో క్లారిటీ ఇచ్చాడు. శ్రీకాంత్ ను డైరెక్ట్ చేయమని తనే అడిగానని, దానికి అడ్డాలను విమర్శించవద్దని ఫ్యాన్స్ కు వివరించాడు ప్రిన్స్.

  తన తప్పును ఒప్పుకోవడం, అందుకు వేరే వాళ్లను బాధ్యులను చేయవద్దనడం అనేది మంచి లక్షణం. ఈ మంచి లక్షణం మహేష్ బాబుకు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి వంశపారంపర్యంగా వచ్చినట్టు కనిపిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ తన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే, ఆ నిర్మాతకు మరో సినిమాను రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసేవాడని అప్పట్లో అంతా చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఈ సహాయం కాస్త టైం తీసుకునేలా ఉంది. మహెష్ ఒప్పుకున్న కొత్త ప్రాజెక్ట్ని చూస్తే పాత సహాయం కోసం కొత్త సహాయాన్ని పక్కన పెట్టేసినట్టున్నాడు...

  మరిచిపోవాల్సిన సినిమా:

  మరిచిపోవాల్సిన సినిమా:

  మహేష్ బాబు-పొట్లూరి వరప్రసాద్ కాంబినేషన్ ఊసెత్తగానే జనాలకు ఒకరకమైన కలవర పాటు కలిగితే ఆశ్చర్యమేమీ లేదు. పీవీపీ ప్రొడక్షన్లో మహేష్ చేసిన 'బ్రహ్మోత్సవం' అలాంటి ఫలితాన్నిచ్చింది మరి. మహేష్ కెరీర్లో మరపురాని చిత్రంగా నిలిచిపోతుందనుకున్న చాలా త్వరగా మరిచిపోవాల్సిన సినిమా అయింది.

  కొరటాల శివ దర్శకత్వంలో:

  కొరటాల శివ దర్శకత్వంలో:

  ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ బైలింగ్యువల్ సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. మురుగదాస్ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాను శ్రీమంతుడు సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే చేయనున్నాడు.

   ఓ పోస్టర్ ను కూడా:

  ఓ పోస్టర్ ను కూడా:

  ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు.గతంలో మహేష్ పుట్టిన రోజు సందర్భంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా పీవీపీ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించనుందని ప్రకటించారు. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పొస్టర్ పై మహేష్ స్పందించలేదు.

  బ్రహ్మోత్సవం తరువాత:

  బ్రహ్మోత్సవం తరువాత:

  పీవీపీ సంస్థ మాత్రం మహేష్ తో తమకు రెండు సినిమాల ఒప్పందం జరిగిందని, బ్రహ్మోత్సవం తరువాత మరో సినిమా చేయాల్సి ఉందని ప్రకటించింది. తాజాగా పీవీపీ సంస్థ మహేష్ తో నిర్మించాల్సిన సినిమా చేతులు మారింది. అప్పట్లో బ్రహ్మోత్సవం దెబ్బకి కుదేలైపోయిన బయ్యర్లకీ, పీవీపీకీ తాను భరోసా ఇచ్చాడు మహేష్ అంతేకాదు

  వంశీ పైడిపల్లి:

  వంశీ పైడిపల్లి:

  దీని తర్వాత పీవీపీకి మరో సినిమా చేస్తానన్న హామీని నిలబెట్టుకుంటూ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడు మహేష్. ఈ ఏడాది మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి మీడియాలో ఘనంగా ప్రకటనలు కూడా ఇచ్చేశాడు పీవీపీ. తీరా చూస్తే ఇప్పుడు ఈ సినిమా నుంచి పీవీపీ బయటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

  మాట నెరవేర్చుకుంటున్నాడట:

  మాట నెరవేర్చుకుంటున్నాడట:

  కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే మహేష్-వంశీ పైడిపల్లి సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు మరో అగ్ర నిర్మాత అశ్వనీదత్ కూడా ఈ ప్రాజెక్టులోకి రావడం విశేషం. అశ్వనీదత్‌కు 'సైనికుడు' తర్వాత మరో సినిమా చేస్తానని మాటిచ్చిన మహేష్.. ఇన్నాళ్లకు ఆ మాట నెరవేర్చుకుంటున్నాడట.

  వేరే సినిమా చేస్తానని చెప్పాడట:

  వేరే సినిమా చేస్తానని చెప్పాడట:

  మరి పీవీపీకి ఇచ్చిన హామీ సంగతేంటని సందేహం రావచ్చు. ఆయనకు ఇది కాకుండా వేరే సినిమా చేస్తానని చెప్పాడట. మొత్తానికి అలా మహేష్-పీవీపీ బంధానికి తాత్కాలికంగా తెరపడింది. వంశీ పైడి పల్లి దాదాపుగా ఇప్పటికే స్క్రిప్టు పూర్తి చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. దిల్ రాజుతో మహేష్ ఇంతకుముందు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చేసిన సంగతి తెలిసిందే.

  English summary
  As per the grapevine in the Industry, PVP walked out of Mahesh Babu-Vamsi Paidipally project for reasons best known to him. Dil Raju who shares a good rapport with Vamsi took up the responsibility. An official announcement regarding the same is awaited.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X