మహేష్ బాబు 'ఖలేజా' ను కూడా 'కొమరం పులి'లా సాగదీస్తున్నారా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల నిరీక్షణకు తెరపడే రోజు త్వరలోనే రాబోతుంది. ప్రిన్స్ మహేష్ ని వెండితెరమీద చూడాలన్న అబిమానుల కోరిక అక్టోబర్ తోలివారంలో తీరబోతుంది. దానికి కారణం మహేష్ బాబు కొత్త సినిమా ఖలేజా విడుదల తేదీని నిర్మాత ప్రకటించారు. నిర్మాతగా శింగనమల రమేష్ బాబు నిర్మించిన మొట్టమొదటి సినిమా కోమరం పులిని సెప్టంబర్ 10న గ్రాండ్ గా విడుదల చేయనున్న సంగతి తేలిసిందే. దానితో పాటు ద్వితీయ చిత్రమైన ఖలేజా రిలీజ్ డేట్ నికూడా కన్ ఫర్మ్ చేశారు.
సెప్టంబర్ 5 నుండి 8 వరకూ అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించిన చివరి పాటతో జస్ట్ మూడు రోజుల ప్యాచ్ వర్క్ మొత్తం పూర్తి అవుతుందని అన్నారు. దానిని బట్టి అక్టోబర్ 7న ప్రిన్స్ మహేష్ బాబు ఖలేజా ని విడుదల చేస్తామని నిర్మాత శింగనమల రమేష్ బాబు వెల్లడించారు. ఈ నెల రెండో వారంలో ఖలేజా ఆడియో రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు. అతిధి సినిమా రిలైజై మూడేళ్శు అవుతుంది. అందుకే అభిమానులు మహేష్ సినిమా ఎప్పుడూ రిలీజ్ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఖలేజా సినిమా రిలైజై రికార్డుల్ని తిరగరాయాలని ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు కోరుకుంటున్నారు. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం రెంటికి ఒకే నిర్మాత కావడంతో మహేష్ బాబు 'ఖలేజా' ను కూడా 'కొమరం పులి'లా సాగదీస్తారేమోనని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











