twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసలే సెక్స్ బాంబు...ఆపై నగ్నంగా

    By Srikanya
    |

    బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్ త్వరలో నగ్నంగా కనిపించి అలరించనుంది. బాలీవుడ్‌లో మార్కెట్‌ కోల్పోయిన ఈ శృంగార తార మళ్లీ పుంజుకొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ నగ్న సన్నివేశానికి సై అందని సమాచారం. ఆమె హీరోయిన్ గా నిర్మితమవుతున్న 'హిస్‌స్‌స్‌...' నగ్నంగా ఫొటోలకు పోజిలిచ్చేందుకు అంగీకరించిందని సమాచారం. 80 దశకంలో జర్మన్‌ నటి నస్టజ కిన్‌స్కి ఇచ్చిన నగ్న భంగిమల తరహాలో ఫొటోలు తీయించుకోవాలనుకొంటోంది. కిన్‌స్కి ఒంటికి ఓ కొండ చిలువని చుట్టుకొని ఫొటోలు తీయించుకొంది. 'హిస్‌స్‌స్‌' గురించి కేన్స్‌ చిత్రోత్సవంలో ప్రచారం చేసుకొని అంతర్జాతీయ మార్కెట్‌లో వ్యాపారం చేయాలని మల్లిక అనుకొంటోంది. వచ్చే నెలలో జరిగే ఆ ఉత్సవాల్లో ఆమె పాల్గొనబోతోంది. ఇక ఈ సినిమాకు సరైన వ్యాపారం కూడా సాగట్లేదని సమాచారం. అందుకే మల్లిక ఈ నగ్న నిర్ణయానకి వచ్చిందని సమాచారం.

    ఇక మల్లికా షెరావత్ ఇప్పుడు నొ డైలాగ్స్...ఓన్లీ ఏక్షన్ అనే నిర్ణయానికొచ్చింది. ఆమె తాజాగా స్నేక్ ఉమెన్ గా చేస్తున్న ఈ 'హిస్‌స్‌స్‌' చిత్రంలో ఆమెకు డైలాగులు అసలు లేవు. ఇక ఈ సినిమాలో అన్నీ ఫేస్ ఎక్స్ ప్రెషన్సే నంటోంది మల్లిక. అందులోనూ పాములాగే ఆమె బుస కొడుతుందిట. ఇక ఆమె పాము పాత్ర కోసం సూట్ వేసుకున్నాక నడవటానికి కూడా ఇబ్బందేనట. ఈ సినిమాలో ఆమె పగ తీర్చుకునే నాగిని గా చేస్తోంది...అయినా పాములు రెగ్యులర్ గా మాట్లాడవు కదా...అనే ఈ రకంగా ఏర్పాటు చేసానంటోంది ఆ చిత్ర దర్శకురాలు జెన్నిఫర్ లిచ్. అయితే మల్లికా లాంటి సెక్స్ బాంబ్ లకు మాటలతో పనేముంటుంది.చూపులు...చేష్టలు చాలు కదా అంటున్నారు ఆమెతో గతంలో డేటింగ్ చేసినవాళ్ళు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X