పదకోండు సంవత్సరాల తర్వాత యాంకర్ మందిరా బేడికి ప్రెగ్నెంటా?
బాలీవుడ్ లోని ముప్పయి సంవత్సరాలు దాటిన అందగత్తెలలో అందమైన శరీరం కలిగినటువంటి తారగా కూడా ఇటీవల గుర్తింపు పోందారు. క్రికెట్ కామెంటేటరీ మాత్రమే కాకుండా మ్యాగజైన్స్ కు హాట్ ఫోటో షూట్స్ చేయడంవల్ల కూడా మందిరా బేడికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. బాలీవుడ్ హీరోయిన్ మరియు యాంకర్ అయినటువంటి మందిరా బేడి ప్రస్తుతం ప్రగ్నెంట్ అంటూ ఊహాగానాలు బాలీవుడ్‌లో చెలరేగుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా పెళ్శి అయి పదకోండు సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు మందిరా బేడికి పిల్లలు పుట్టలేదు. కాగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ వల్ల మందిరా బేడి తన మొట్టమొదటి పాపాయికి జన్మనివ్వనున్నట్లు సమాచారం.
మందిరా బేడి పదకోండు సంవత్సరాలు క్రితం రాజ్ కౌశాల్ అనే వ్యక్తిని పెళ్శి చేసుకున్న విషయం తెలిసిందే. అటుతర్వాత పలు టివి ఛానల్లో లేడి క్రికెటర్ కామెంటరీగా బాగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. దానితో బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించడం జరిగింది. ఇది ఇలా ఉంటే జూన్‌లో మందిరా బేడి మరియు తన భర్త రాజ్ కౌశాల్ ఇద్దరూ తల్లి దండ్రులు అవడానికి అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు వెల్లడించారు.
ముఫ్పయి ఎనిమిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి మందిరా బేడి పాతికేళ్శ యువతులు సైతం అసూయ పడేలా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న మందిరా బేడి ఇటీవల తన బాజీని ఇదివరకటి కంటే కూడా ఎక్కువగా ఇప్పుడు ఎక్స్ పోజింగ్ చేస్తుంది. ఇటీవల వోగ్ మ్యాగజైన్ కోసం మందిరా బేడి ఇచ్చినటువంటి టాప్ లెస్ పోజ్ ఇటు తన అభిమానులను, అటు బాలీవుడ్ సినీ విశ్లేషకులకు మంచి హాట్ టాపిక్ గామారింది. ఇది మాత్రమే కాకుండా ఈవయసులో ఈమెకు ఇదేమి ఆనందం అంటూ చాలా మంది చెవులు కోరుక్కున్నారు.


Click it and Unblock the Notifications











