అల్లు అర్జున్‌పై చిరంజీవి సెటైర్.. టాలెంటే కాదు క్యారెక్టర్ అంటూ మెగా కామెంట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతూనే ఉంటారు. చెట్టు ఎంత ఎత్తు ఎదిగిన దానివేర్లు భూమిలోనే ఉంటాయి అలా మనం ఉన్నత స్థాయికి చేరుకున్న మన కాళ్లు నేల మీదనే ఉండాలి. మనకు టాలెంట్ ఉంది కదా.. మనకు సక్సెస్ వస్తుంది కదా అని కాలర్ ఎగరేస్తే.. మన భవిష్యత్తుకే ప్రమాదం. టాలెంట్ తో పాటు సరైన ప్రవర్తన కూడా ఉండాలి' అని మెగాస్టార్ చిరంజీవి హితవు పలికారు. తాజాగా ఆప్త (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో పాల్గొన్న చిరంజీవి తన సక్సెస్ జర్నీని అభిమానులతో పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన సీని జీవితం ఆరంభం గురించి మాట్లాడుతూ.. 'ఎవరూ తెలియకుండానే ఇండస్ట్రీలోకి ఇంటర్ అయ్యాను. కళ్లకు గంతలు కట్టిన గుర్రం లాగా లక్ష్యం వైపు ప్రయాణించాను. సినిమా రంగంలో నెంబర్ వన్ కావాలనే ఉద్దేశంతో పరుగులు తీశాను. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. వాటన్నిటిని నాకు అనుకూలంగా మార్చుకొని ప్రయాణించాను. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి మహానటులు ఇండస్ట్రీలో ఏలుతున్న సమయంలో ఓ కొత్త హీరో అవకాశాల కోసం రావడం అదో పెద్ద సాహసమే. కానీ, వాటన్నిటినీ తట్టుకుంటూ నిలబడి ఈ స్థాయికి చేరుకున్నాను 'అంటూ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు.

Is Mega star Chiranjeevi target Allu Arjun indirectly in Apta Event speech

'కెరీర్ ప్రారంభంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారితో తిరుగులేని మనిషి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాతో నాకు కూడా మంచి పేరు వచ్చింది. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్ గారితో మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. నా దగ్గర డేట్లు కూడా తీసుకున్నారు. కానీ, నన్ను ఆ సినిమా నుండి తీసివేసి మరో నటుడికి అవకాశం ఇచ్చారు. దీంతో తొలుత చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ టైంలో సినిమా పోయిందంటే.. బాడ్ అయ్యే అవకాశాలున్నాయి. ఐరన్ లెగ్ అనే అవకాశముంది. కానీ, ఎక్కడ కూడా నెగిటివ్గా ఆలోచించలేదు. గద్దలాగా పాజిటివ్ గా ఉండి ఎగిరాను. చిరంజీవి వద్దు అనుకున్న వారితోనే ఎన్టీఆర్ గారి కంటే నాలుగు సినిమాలు ఎక్కువగా చేసేలా చేసుకున్నాను.. ఆ రోజులలోనే నా సినిమా కోటి రూపాయలు వసూలు చేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. మీ పాజిటివ్ థింకింగ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం ప్రారంభంలో లక్ష్యసాధనలో నిలదొక్కుకోవడం ప్రధానం' అంటూ తన సక్సెస్ సీక్రెట్ ను మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు.

'అలాగే.. డబ్బు ప్రధానం కాదు .. నిలబడిన తర్వాత డబ్బు దానంతట అదే వస్తుంది. నాతో పని చెయ్యొద్దని భావించిన వాళ్లు కూడా నాతో సినిమాలు చేసేలా చేసుకున్న. ఇండస్ట్రీలో టాలెంట్ అనేది సెకండరీ.. నిర్మాతలతో ఎలా ఉంటున్నావ్.. వాళ్లకు ఎలా సపోర్ట్ చేస్తున్నావు.. అనేది చూసుకోవాలి. టాలెంట్ తో పాటు బిహేవియర్ కూడా ఉండాలి. ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ గ్యాప్ ను భర్తీ చేయడానికి ఎందరో మహానుటలు నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ వంటి స్టార్ హీరోలు ఉన్నారు. అయితే అప్పుడే కొత్తగా వచ్చిన వాడికి ఛాన్స్ రావడం అంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ సమయంలో ప్రేక్షకులు నన్ను గుర్తించి చేయూతనిచ్చారు. అలా వారివల్లే నేడు మెగాస్టార్ గా సినిమాలలో రాణిస్తున్నాను. జీవితంలో ఎదగడానికి టాలెంట్ తో పాటు క్యారెక్టర్ కూడా ముఖ్యం' అంటూ హితువు పలికారు మెగాస్టార్ చిరంజీవి.

'మారుతున్న కాలానికి తగినట్లుగా కథలను ఎంచుకొని సినిమాలు చేశాను. నా సీనియర్ నటుల నుండి మంచి విషయాలు నేర్చుకున్నాను. నా అభిమానులు నాకు కొండంత అండగా నిలిచారు వారి సహకారంతోనే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేసుకుంటూ వచ్చాను. నా ప్రయాణంలో నేను ఇన్‌స్పిరేష‌న్‌గా ఎలాగైతే నిలిచానో ఇక్క‌డున్న వారంద‌రూ భ‌విష్య‌త్తులో రాబోయే ఎంట‌ర్‌ప్రెన్యూరర్స్‌కి ఇన్‌స్పిరేష‌న్‌గా రావాల‌ని కోరుకుంటున్నాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, నా ఫ్యామిలీలోని నా బిడ్డ‌లంద‌రూ నా అచీవ్‌మెంటే.ఈ మ‌ధ్య ఓ ప‌త్రిక క‌పూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని మా ఫ్యామిలీ గురించి ప్ర‌స్తావించడం.ఇది నా గొప్ప‌ద‌నం కాదు. ప్రేక్ష‌కులు, అభిమానులు ఇలా ఆద‌రించారు కాబ‌ట్టే ఇక్క‌డున్నాం' అని చిరంజీవి పేర్కొన్నారు.

ప్రస్తుతం చిరంజీవి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజంగా కొంతమంది హీరోలు ఒక్కసారి సక్సెస్ రాగానే కాలర్ ఎగరేసుకుంటూ రెచ్చిపోతున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు.. అల్లు అర్జున్ సన్ డైరెక్ట్ గా చిరంజీవి టార్గెట్ చేశారా? అని కూడా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా ఇంత ఎదుగుతే అంత ఒదిగి ఉండాలనేది జీవిత సత్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X