ముద్దు: మికా సింగ్ పరువు తీసిన సన్నీ లియోన్ (ఫోటోస్)
హైదరాబాద్: గతంలో ఓ పార్టీలో రాఖీ సావంత్‌ను బలవంతంగా ముద్దుపెట్టుకుని వివాదంలో ఇక్కుక్కున్న ప్రముఖ గాయకుడు మికా సింగ్‌కు తాజాగా ఊహించని అనుభవం ఎదురైంది. మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌ను ముద్దు పెట్టాలని అడిగిన అతడికి నిరాశే ఎదురైంది. ముద్దు కోసం అర్రులు చాచిన అతనికి సన్నీ లియోన్ ఝలక్ ఇచ్చింది.
‘బల్విందర్ సింగ్ ఫేమస్ హో గయా' అనే చిత్రంలో మికా సింగ్, సన్నీ లియోన్ కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఆ చిత్రం ఆడియో వేడుకకు మికా సింగ్, సన్నీ లియోన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మికా సింగ్ తన బుగ్గపై ముద్దు పెట్టాలని సన్ని లియోన్‌ను అడిగాడు. అయితే సన్నీ ముద్దు పెట్టకుండా జస్ట్ పెక్ ఇచ్చి (మర్యాద పూర్వకగా బుగ్గుకు బుగ్గ ఆనించడం) అతన్ని నిరాశ పరిచించింది.
గతంలో రాఖీ సావంత్‌ను బలవంతంగా ముద్దు పెట్టుకున్న మికా సింగ్...సన్నీ లియోన్ విషయంలో మాత్రం ఆ సాహసం చేయలేక పోయాడు. ఎందుకంటే సన్నీ లియోన్ వెంట ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా ఉన్నారు కాబట్టి. ఈ వ్యవహారినికి సంబంధించిన ఫోటోలపై స్లైడ్ షోలో ఓ లుక్కేయండి.

ముద్దు పెట్టమని అడుగుతున్న మికా సింగ్
తన బుగ్గపై ముద్దు పెట్టాలని మికా సింగ్ అడుగుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

సన్నీ లియోన్ ఝలక్
అయితే మికా సింగ్ ముద్దు కోరిక తీర్చకుండా కవలం పెక్ తో సరిపెట్టింది సన్నీ లియోన్. దీంతో మికా సింగ్ మొహం అదోలా పెట్టాడు.

మికా సింగ్
ఈ ఆడియో వేడుకలో మికా సింగ్ హడావుడి చేస్తూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారాడు.

సన్నీతో రాసుకు పూసుకు..
ఈ చిత్రం ఆడియో వేడుకలో మికా సింగ్...సన్నీ లియోన్‌తో రాసుకు పూసుకుని తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు.

సన్నీ లియోన్ భర్త
ఈ ఆడియో వేడుకకు సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబర్ కూడా హాజరయ్యారు.

చెరో చేయి...
సన్నీ లియోన్ తన భర్త చేయి పట్టుకుని నడుస్తుంటే...మికా సింగ్ ఆమె చేయి పట్టుకుని ఇలా కనిపించారు.

సన్నీ లియోన్ బ్లూ..
బ్లూ అండ్ బ్లాక్ డ్రెస్సులో సన్నీ లియోన్ ఎంతో అందంగా దర్శనమిచ్చింది.

భర్తతో సన్ని లియోన్
భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ లియోన్ ఇలా...


Click it and Unblock the Notifications











