బొమ్మరిల్లుకీ మిస్టర్ ఫర్ ఫెక్ట్ కూ అస్సలు సంభందం లేదు: దిల్ రాజు
మొన్న శుక్రవారం విడుదలైన మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రం బొమ్మరిల్లు చిత్రానికి రీమేక్ లా ఉందని అంతటా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నే ప్రమేషన్ లో తిరిగుతున్న దిల్ రాజు ఎదట పెడితే ఆయన కొట్టిపారేసారు.ఆయన మాటల్లోనే.. మంచి తండ్రి మంచి కొడుకు మధ్య ఉండే ఓ కొత్త కోణాన్ని ఆధారంగా చేసుకుని 'బొమ్మరిల్లు' తీశాం. కానీ మిస్టర్ పర్‌ఫెక్ట్ అలాంటి స్టోరీ కాదు. కెరీర్ ఓరియెంటేషన్‌లో పడి కోల్పోతున్న మానవ సంబంధాలు నేటి యూత్ పరిస్థితి కథాంశాలుగా తీసాను అన్నారు.అలాగే ట్రెండ్‌కు అనుగునంగా వెళ్లే వ్యక్తిని కాదు. విభిన్నమైన కథనాలతో పెద్ద పెద్ద హీరోలు చేశారు. రవితేజ హీరోగా మొదటి ఫ్యామిలీ స్టోరీ 'భద్ర' అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌తో 'బృందావనం' అలాగే నాగ్‌తో 'గగనం' ఇప్పుడు...'మిస్టర్ పర్‌ఫెక్ట్'కుటుంబ కథా నేపథ్యంలోసాగే ప్రేమకథా చిత్రం. ప్రభాస్ కాజల్ తాప్సీలు చక్కగా చేశారు. వారిమధ్య బ్రిలియంట్ కెమిస్ట్రీ కుదిరింది అన్నారు.


Click it and Unblock the Notifications











