చైతు విషయంలో నాగార్జున ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!?
'జోష్"తో హీరోగా ఎంటరైన నాగచైతన్య ఆ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన 'ఏమాయ చేసావె", సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన '100% లవ్" నాగచైతన్యకి మంచి బ్రేక్ నిచ్చాయి. ఆయితే ఆ తర్వాత శివప్రసాద్ రెడ్డి నిర్మించిన దడ డిజాస్టర్ కావడంతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. అప్పటి నుండి చైతు కెరీర్ గురించి నాగార్జున ఆందోళన చెందుతున్నాడు.
'శివ" తనకు ఎంత పేరు తెచ్చిందో నాగచైతన్యకు 'బెజవాడ" అంత పేరు తెస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు. అందుకే'బెజవాడ" ఓవర్సీస్ రైట్స్ తీసుకొని ఫారిన్ లో విడుదల చేయడానికి రెడీ అయిపోయాడు నాగార్జున. అన్నపూర్ణ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేయ్యబోతున్నట్టు సమాచారం. మరి నాగ్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా...
నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'బెజవాడ". రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు నిర్మిస్తున్నారు. వివేక్ కృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అమలాపాల్ నాయిక. త్వరలో పాటల్ని విడుదల చేసి, ఈ నెలాఖరున సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐదుగురు ఫైట్ మాస్టర్లు ఈ చిత్రానికి పని చేయడం విశేషం.
ఇంకా ఈ చిత్రంలో ప్రభు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అజయ్, అంజనా సుఖాని, శుభలేఖ సుధాకర్, అభిమన్యుసింగ్, ముకుల్‌దేవ్, సత్యప్రకాశ్, అశోక్‌కుమార్, శ్రావణ్, లక్ష్మి, రాహుల్ తదితరులు కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి పాటలు: రెహమాన్, సిరాశ్రీ, కలువపాయి, సంగీతం: అమర్ మొహెలే, ప్రదీప్ కోనేరు, ప్రేమ, ధరమ్ సందీప్, విక్రమ్, బప్పీ టూటెల్, ఛాయాగ్రహణం: ఎస్.కె. భూపతి, కూర్పు: గౌతంరాజు, డాన్స్: ప్రేమ్‌రక్షిత్, శోభ, నిర్మాతలు: రాంగోపాల్‌వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వివేక్‌కృష్ణ.


Click it and Unblock the Notifications











