Bhagavanth Kesari YSజగన్‌పై బాలకృష్ణ సెటైర్లు? టీజర్‌లో డైలాగ్స్ వైరల్..సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా..
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రం టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను బాలయ్య జన్మదినం సందర్భంగా విడుదల చేయగా అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ చిత్రంలోని బాలయ్య చేత తెలంగాణ యాసలో చెప్పించిన డైలాగ్స్ మరోసారి రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. టీజర్ విడుదలైన తర్వాత ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా సినిమా ద్వారా సెటైర్లు విసిరారనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ డైలాగ్, సెటైర్ విషయంలోకి వెళితే..
నందమూరి బాలకృష్ణ నటించే సినిమాల్లో సన్నివేశాలను అధికార ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా డిజైన్ చేయడం సర్వసాధారణంగా మారుతున్నది. లెజెండ్ నుంచి వీరసింహారెడ్డి మూవీ వరకు వైసీపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడిన డైలాగ్సే ఎక్కువగా కనిపిస్తుంటాడు. నందమూరి ఫ్యామిలీ అభిమానించే దర్శకులు కూడా అదే దారిలో జగన్ ప్రభుత్వాన్ని, ఏపీ సీఎంను పరోక్షంగా టార్గెట్ చేయడం జరుగుతూనే ఉంది.

ఇక తాజాగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా టీజర్‌లో వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసినట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాజు ఆడి వెనుక ఉన్న వందల మందిని చూయిస్తడు. మొండోడు ఆడికి ఉన్న ఒకే ఒక గుండెను చూయిస్తడు.. అడవి బిడ్డ నెలకొండ భగవంత్ కేసరి అంటూ బాలకృష్ణ పెట్టిన కేక అభిమానులకు మరింత జోష్ పుట్టించింది. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం టీడీపీపై వందల మందిని ఉసిగోల్పి మాటల దాడి చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పిన డైలాగ్స్ అని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
భగవంత్ కేసరి టీజర్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కేక పెట్టిస్తున్నాయని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్యను కొత్త కోణంలో అనిల్ రావిపూడి చూపిస్తున్నాడనేది స్పష్టమైంది. పొలిటికల్ డైలాగ్స్ రుచిని చూపించాడు అంటూ ప్రశంసిస్తున్నాడు. సిస్టర్ సెంటిమెంట్‌తో సాగే పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పుకొంటున్నారు. బాలకృష్ణ మాస్ అప్పీల్‌ను చూసి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
భగవంత్ కేసరి మూవీ టీజర్‌కు యూట్యూబ్‌లో సునామీ సృష్టిస్తున్నది. ఈ ీజర్ 24 గంటల్లో 12 మిలియన్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇది బాలకృష్ణ కెరీర్‌లో ఓ రికార్డుగా యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో అఖండ టీజర్ 24 గంటల్లో 7.4 మిలియన్ వ్యూస్‌ను సాధించడం తెలిసిందే. భగవంత్ కేసరి టీజర్ యూట్యూబ్‌లో నెంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతున్నది.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. క్లాస్, మాస్ అంశాలను మేలవించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా దసరా 2023 కి విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











