ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ స్వాతంత్ర సమర యోధుడు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పుట్టేపుట్టని హరికృష్ణ ఎలా స్వాతంత్య్ర సమరయోధుడు అయ్యాడో అని అంతటా చర్చనీయాంశమైంది. భారత ప్రభుత్వ వెబ్ సైట్ లోను, రాజ్యసభ వెబ్ సైట్ లోను ఈ విషయం ఉంది. రాజ్యసభ లోక్ సభ సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలను పార్లమెంటు నిర్వహించే వెబ్ సైట్ తోపాటు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. ఈ వివరాల్లో నందమూరి హరికృష్ణను స్వాతంత్ర సమరయోధునిగా పేర్కొన్నారు. దాంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అరవై రెండేళ్ళు అవుతోంది. కదా దీన్ని బట్టి హరికృష్ణ వయస్సెంత అంటున్నారు. అప్పటికింకా జన్మించని హరికృష్ణ స్వాతంత్ర్య పోరాటంలో ఎలా పాల్గొన్నట్టు? అలాగే రాష్ట్రానికి చెందిన 42 మంది ఎంపిల్లో ఒక్కరికి కూడా పిల్లలు లేరట! పార్లమెంటు సభ్యుడు జి.వెంకటస్వామి కుమారుడు రాష్ట్ర కార్మిక మంత్రి జి.వినోద్ అయితే, పార్లమెంటు వెబ్ సైట్ మాత్రం వెంకటస్వామికి సంతానం లేదని చెబుతోంది. లోక్ సభ సభ్యులతోపాటు రాజ్యసభ సభ్యులకు కూడా సంతానం లేరని ఆ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఇదీ మన కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ నిర్వాకం..