పెళ్లి చేసుకోబోతున్న హీరో నాని
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో నాని త్వరలో ఓ ఇండివాడు కాబోతున్నాడు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం విశాఖపట్నంకు చెందిన ఓ ఇంజనీరింగ్ చదివిన అమ్మాయితో నాని వివాహం జరుగనుందని, ఇప్పటికే ఒకరినొకరు చూసుకోవడం, ఇష్టం పడటం కూడా జరిగిందని సమాచారం. ఈ సంవత్సరాంతంలో వీరి పెళ్లి ముహూర్తం ఖరారు కావొచ్చిన తెలుస్తోంది. ఇది పెద్దలు చూసిన సంబంధమే అని, ఇరు కుటుంబాల అంగీకరాంతోనే ఈ మ్యాచ్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
నాని ప్రస్తుతం గౌతం మీనన్ దర్శకత్వంలో 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంతో, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో నాని నటించిన 'ఈగ' చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.


Click it and Unblock the Notifications











