నయన్ కి అదే గనుక జరిగితే గాసిఫ్స్ వగైరా వగైరా హాంఫట్...!?
ప్రభుదేవాతో పెళ్లి అయిపోయిందని వార్తలు వస్తున్నా వాటిని సున్నితంగా తిరస్కరిస్తుంది నయన్. గాసిప్స్ గురించి విని విని బోర్ కొట్టిందని ఇకపై ఎవరు ఎలాంటి గాసిప్ రాసినా పట్టించుకోనని తెగేసి చెప్తుతుంది అని అనుకుంటున్నారు. 'సింహా" చిత్రం తర్వాత ఒక్క తెలుగు చిత్రంలో చేయడం కానీ..అసలు తెలుగు చిత్రంలో చేయడానికి ఓప్పుకున్నట్లుగానీ సమాచారంలేదు. అదేమని అడిగితే ఇతర భాషల్లో బిజీగా ఉన్నాను..అందుకే అంటుంది..నయన్. ఒకవేళ చిత్రం చేస్తే మాత్రం అది సింహా చిత్రంలో చేసిన పాత్ర తర్వాత చేసే పాత్ర ఏలా ఉండాలో అలాంటి పాత్రే చేస్తానంటుంది.
రోజుకో గాసిప్ తో గత కొంత కాలంగా వేలెత్తి చూపిస్తున్న నయన్ ని తమ సినిమాలలో పెట్టుకోవాడానికి ఏ దర్శకనిర్మాత ఇష్టపడటం లేదు. అందుకే ఎలాగైనా మళ్ళీ తెలుగు చిత్రంలో నటించాలని ఉన్నట్టుగా ఉంది నయన్ కి. సింహా పాత్ర లాంటి పాత్ర అంటూ తనే డిక్లేర్ చేస్తుంది..అన్నట్టు మహేష్ చేస్తున్నాడని వార్తలు వస్తున్న '3 ఇడియట్స్" రీమేక్ లో అమ్మడు పేరే వినబడుతోంది..అదే గనుక జరిగితే శంకర్ డైరెక్షన్, మహేష్ బాబు సరసన ఇంకేం కావాలి నయన్ కి..గాసిప్స్ వగైరా వగైరా హాంఫట్..


Click it and Unblock the Notifications











