భారీగా డ్రగ్స్‌తో యువ సినీహీరో లవర్ అరెస్ట్.. పోలీసుల అదుపులో యువతి!
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో, ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి కలకలం రేపింది. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌కు చెందిన పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఓ మహిళ వద్ద భారీగా డ్రగ్స్ పట్టుకోవడం సంచలనం రేపింది. ఓ సినీ హీరో ప్రేయసిగా భావిస్తున్న ఈ యువతితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? డ్రగ్స్ సప్లై ఎలా జరుగుతుందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంచలన అరెస్ట్ వివరాల్లోకి వెళితే..
ముందుస్తుగా అందిన పక్కా సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు నార్సింగి ప్రాంతంలో సోదాలు జరిపారు. ఆ సోదాల్లో లావణ్య అనే యువతి వద్ద 4 గ్రాములు ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయి. వెంటనే ఆ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని.. ఆమెను అదుపులోకి తీసుకొన్నారు.

అయితే లావణ్యను అదుపులోకి తీసుకొన్న పోలీసులు క్షుణంగా విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సరఫరా చేశారు. ఎందుకోసం ఉపయోగించాలనుకొన్నారు? రేవ్ పార్టీకి ఏమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇక లావణ్యను ఓ పక్క విచారిస్తూనే మరో పక్క NDPS యాక్ట్ లేదా నార్కోటిక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. లావణ్యకు ఉన్న సంబంధాలు, ఫోన్ అండ్ వాట్సప్ ఛాటింగ్‌ను పరిశీలిస్తూ నార్సింగ్ పోలీసుల మరికొంత మంది నివాసాలపై దాడులు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, లావణ్య అనే యువతి.. సినీ హీరో రాజ్ తరుణ్‌కు ప్రేయసి అని గుర్తించారు. ఈ విషయంపై ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తారనే విషయంపై మీడియా దృష్టిపెట్టింది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఉన్నతాధికారితో కూడిన ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తాజా దాడి జరిగిందనే విషయం తెలిసింది.


Click it and Unblock the Notifications











