ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందట.. .. సతీష్, కొరటాల శివ ఇన్.. త్రివిక్రమ్ అవుట్

By Rajababu

Recommended Video

ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందట.. కారణం ఇదే !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అనగానే నందమూరి, మెగా, ఇతర సినీ అభిమానుల్లో ఓ క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఏకంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చి క్లాప్ కొట్టడంతో క్రేజ్ మరింత పెరిగింది. సినిమా పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణానికి వారి సినిమా ఓ బాటను వేస్తున్నదనే అభిప్రాయం వినిపించింది. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందనే ఓ నిరాధార వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నది. అయితే అటు ఎన్టీఆర్ వర్గం నుంచి గానీ, త్రివిక్రమ్ సర్కిల్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం, ఎవరూ స్పందించకపోవడంతో ఆ వార్త రూమారా లేదా వాస్తవమేనా అనే సందిగ్ధత మధ్య కొట్టుమిట్టాడుతున్నది.

 పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టి..

పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టి..

సొంత సినిమా ప్రారంభోత్సవాలకు ఆమడదూరంలో ఉండే పవన్ కల్యాణ్ ఏకంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారనే వార్త ఆ మధ్య సంచలనం రేపింది. ఆ తర్వాత ఓపెనింగ్ షాట్‌కు పవన్ క్లాప్ కొట్టడం, ఎన్టీఆర్ ఫ్యామిలీతో పవన్ అన్యోన్యంగా మాట్లాడుతూ కనిపించిన ఫొటోలు ఇరు వర్గాల ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తాయి.

 ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య క్రియేటివ్ చిచ్చు

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య క్రియేటివ్ చిచ్చు

కానీ ఆ సినిమా ఓపెనింగ్ తర్వాత.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య ఏవో క్రియేటివ్ విభేదాలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆ సినిమా చేయడం లేదు వచ్చాయి. కానీ గత రెండు మూడు రోజుల వ్యవధిలో ఆ వార్తకు బలం చేకూరుస్తూ.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే విషయం సినీవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ భద్రాది పర్యటన తర్వాత ఈ చర్చ మరింత ఊపందుకొన్నది.

 ఎన్టీఆర్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా?

ఎన్టీఆర్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా?

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్‌తో చేస్తున్న సినిమా జనవరి రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతున్నది. అప్పటివరకు మరో సినిమా త్రివిక్రమ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఓ వర్గం చెప్తున్నప్పటికీ.. అది సాధ్యం కాదంటున్నారు మరి కొందరు.

 కొరటాల శివకు గ్రీన్ సిగ్నల్

కొరటాల శివకు గ్రీన్ సిగ్నల్

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. కొరటాలతో వచ్చే ఏడాది జనవరిలోగానీ, ఫిబ్రవరిలో గానీ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సినీవర్గాల్లో నానుతున్నది.

 దిల్ రాజుకు గ్రీన్ సిగ్నల్

దిల్ రాజుకు గ్రీన్ సిగ్నల్

ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రంపై కాకుండా దిల్ రాజు రూపొందించబోయే చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. శతమానం భవతి దర్శకుడు సతీష్ వెగ్నేష చెప్పిన కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

సతీష్ కథపై దిల్ రాజు కాన్ఫిడెంట్

సతీష్ కథపై దిల్ రాజు కాన్ఫిడెంట్

సతీష్ వెగ్నేష చెప్పిన కథ విన్న దిల్ రాజు మంచి కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్టు తెలుస్తున్నది. ఎన్టీఆర్ చేస్తే ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడం తథ్యం అనే భావనలో దిల్ రాజు ఉన్నారట. దీంతో ఆ కథతోనే ఎన్టీఆర్‌తో సినిమాకు రంగం చేస్తున్నట్టు తెలుస్తున్నది.

 శ్రీనివాస కల్యాణం టైటిల్

శ్రీనివాస కల్యాణం టైటిల్

ఎన్టీఆర్, దిల్ రాజు, సతీష్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా టైటిల్ కూడా ఖరారు అయినట్టు సమాచారం. ఈ చిత్రానికి శ్రీనివాస కల్యాణం అనే పేరును ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడితే తప్పా దీనిని ధృవీకరించడానికి వీలులేదు అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X