‘దూకుడు’లో ప్లస్ అయింది..‘ఊసరవెల్లి’లో మిస్ అయింది...!?
మహేష్ బాబు నటించిన 'దూకుడు", జూ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'ఊసరవెల్లి" ఇటీవలే విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ 'దూకుడు"కు మాత్రం రిపీట్ ఆడియన్స్ ఉంటున్నారని, విడుదలై ఇన్ని రోజులైనా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతోందని తెలుస్తోంది. రాను రాను కలెక్షన్స్ దిశగా పయనిస్తూ వంద కోట్ల రికార్డులు నెలకొల్పే దిశగా పరుగులు తీస్తోంది.
దానికి పూర్తిగా బ్రహ్మానందం, ఎంయస్ నారాయణ కారణమనీ పరిశీలకులు అంటున్నారు. బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఈ సినిమికి బాగా ప్లస్ అయ్యిందని, ప్రతి కామెడీ సీన్ పండిందని, దాంతో జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని, అందుకే ఈ సినిమా సక్సెస్ ఫుల్ చిత్రంగా బాక్సీపీష్ వద్ద నిలిచిందని అంటున్నారు.
అదే ఎన్టీఆర్ 'ఊసరవెల్లి"లో మాంచి కామెడీ ట్రాక్స్ లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయ్యిందని కూడా అంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఊసరవెల్లి చిత్రంలో డైరెక్షన్ లో జూ ఎన్టీఆర్ కొన్ని మార్పులు చేర్పులు చేశారని వినికిడి. ఎందుకంటే మొన్న ఆ మధ్యన సురేందర్ రెడ్డి ఇంటర్వ్యూలో ఊసరవెల్లి సినిమా సబ్జెక్ట్ ని ఫలానా హీరో అంటూ ఎవర్నీ దృష్టిలో పెట్టుకుని తయారు చేయలేదునీ, జూ ఎన్టీఆర్ తో అనుకున్నాక ..జూ ఎన్టీఆర్ చొరవతో కొన్ని మార్పులు చేశామనీ తెలిపడమే అంటున్నారు.


Click it and Unblock the Notifications











