Bujji మహేష్‌ను కాపీ ప్రభాస్ కాపీ కొట్టాడా? ట్రోల్ చేస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్

సాధారణంగా ఏ సినిమలోనైనా వేరే సినిమా రిఫరెన్స్ సీన్స్ ఉంటాయి. అది లోకేషన్ కావొచ్చు.. కాస్ట్యూమ్స్ కావొచ్చు.. ఐకానిక్ స్టెప్ కావొచ్చు. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి ఇవన్నీ ఎవరు గుర్తుపట్టేవారు కాదు. కానీ, ఇప్పుడు అలాకాదు. ఒక పెద్ద సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయినా కూడా అది అంతకుముందు ఎక్కడైనా ఉందా.. ? వీళ్లు ఏమైనా కాపీ కొట్టరా..? అని సెర్చ్ చేసి మరీ బయటకు లాగుతున్నారు. తాజాగా డార్లింగ్ ప్రభాస్.. సూపర్ స్టార్ మహేష్ బాబును కాపీ కొట్టాడు అంటూ నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది.

అసలు ఏంటి కథ అంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే నటిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని బావుండి ఉంటే ఈపాటికి కల్కి రిలీజ్ కూడా ఐపోయింది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా మే నుంచి జూన్ కు వాయిదా పడింది.

Is Pan India star prabhas copied mahesh babu s Spider movie scene Here is the details

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా బుజ్జి వీడియోను రివిల్ చేశారు. గత రెండు రోజుల నుంచి ప్రభాస్ బుజ్జి ఎవరు అంటూ అందరూ ఎంతో ఆత్రుత గా ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు గతరాత్రి బుజ్జి ఎవరో మేకర్స్ తెలిపారు. బుజ్జి అంటే హీరోయిన్ కాదు.. అది భైరవ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక కారు. దాన్ని తయారుచేసే విధానాన్ని చూపిస్తూ.. ఆ కారుకు ఉన్న ప్రాధాన్యత ను కూడా చెప్పుకొచ్చారు.

ఇక కీర్తి సురేష్ ..బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చింది. వీడియో లో అందరూ బుజ్జి బాడీ పార్ట్స్ ను కలపడానికి కష్టడుతూ ఉంటారు.. మధ్యలో బుజ్జి అందరికీ సలహాలు ఇస్తూ ఉన్నా .. దాన్ని ఎవరు పట్టించుకోరు.. ఇక చివరికి భైరవ రంగంలోకి దిగి.. బుజ్జి బాడీని చూపించడానికి స్లో మోషన్ లో వెళ్తుంటే .. బుజ్జి త్వరగా వెళ్ళు.. త్వరగా వెళ్ళు అని తరుముతూ ఉంటుంది. అప్పుడు ప్రభాస్ ..ష్.. అంటూ నోటిపై వేలు వేస్తూ చెప్తాడు..

సేమ్ ఇదే సీన్ మహేష్ బాబు నటించిన స్పైడర్ లో ఉంటుంది. మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో ఫస్ట్ లుక్ పోస్టర్ గా ఈ పోస్టర్ నే రిలీజ్ చేశారు. స్పైడర్ లాంటి ఒక మెటాలిక్ వస్తువు.. మహేష్ వెనుక నుంచి పైకి ఎక్కుతూ భుజం వరకు వచ్చి సౌండ్ చేస్తూ ఉంటే.. టక్కున మహేష్.. ష్ అంటూ నోటి మీద వేలు పెడతాడు.

ఇప్పుడు ప్రభాస్ కూడా అలానే చేయడంతో మహేష్ ను ప్రభాస్ కాపీ కొట్టాడు అంటూ నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. అంతేకాకుండా మహేష్‌ కన్నా ప్రభాస్‌కు బాగా సెట్ అయ్యిందని కూడా చెప్పుకొస్తున్నారు. సీన్ పోలిన సీన్ ఉండటం సహజం.. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X