YS Jaganను మానవబాంబై లేపేస్తా.. ట్విట్టర్‌లో పోస్ట్ కలకలం.. జనసేన ఖండన

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య భారీ సంక్షోభంగా మారింది. నిత్యావసరవస్తువుల కంటే తక్కువ మొత్తంలో సినిమా టికెట్ ధర ఉంది. సింగిల్ టీ కంటే సినిమా టికెట్ ధర తక్కువగా ఉంది. సినిమా థియేటర్‌ కౌంటర్ కంటే కిరాణ కొట్టు కౌంటర్‌లో కలెక్షన్లు భారీగా ఉన్నాయంటూ సినీ వర్గాలు తమ అభిప్రాయాలను ఘాటుగా వెల్లడించారు.

అయినా ఏపీ ప్రభుత్వం తన విధానంపై స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నది. అయితే ఇలాంటి ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో పవన్ కల్యాణ్ అభిమాని పేరిట ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.. ఆ వివరాల్లోకి వెళితే..

ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం

ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం

సినిమా టికెట్ రేట్లు, ప్రత్యేక ప్రదర్శనల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రస్తుతం అత్యంత వివాదాస్పదంగాను, చర్చనీయాంశంగా మారుతున్నది. పేదలకు వినోదాన్ని చేరువ చేయడానికే సినిమా టికెట్ రేట్లు తగ్గించామని ప్రభుత్వం చెబితే.. పెట్రోల్, ఇతర నిత్యావసర వస్తువల ధరల మాటేమిటనే ప్రశ్న సోషల్ మీడియాలో సినీ అభిమానులు లేవనెత్తుతున్నారు.

హీరోలపై కక్ష సాధింపు లేదు అంటూ

హీరోలపై కక్ష సాధింపు లేదు అంటూ

అయితే పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణను తొక్కేయడానికి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని అనుసరిస్తుందనే ఆరోపణలు, విమర్శలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రాంగోపాల్ వర్మతోపాటు కొందరు సినిమా ప్రముఖులు ఇలాంటి అనుమానాల్ని లేవనెత్తారు. అయితే సినిమా పరిశ్రమపై, హీరోలపై ఎలాంటి కక్ష సాధింపు లేదనే విషయాన్ని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ట్వీట్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ట్వీట్

సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు అంశంపై ఇలాంటి విమర్శలు, ఆరోపణలు, వాదనలు కొనసాగుతున్న సమయంలో సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పోస్టు అత్యంత వివాదంగా మారింది. తీవ్రమైన పదజాలంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి అభ్యంతర కామెంట్స్ చేయడంపై అందరూ ఖండిస్తున్నారు. ఏ హీరో అభిమానులైనా ఎవ్వరూ కూడా హద్దు మీర వద్దనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

మానవ బాంబునైతా అంటూ..

మానవ బాంబునైతా అంటూ..

ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఓ నెటిజన్ పోస్టు పెడుతూ.. పవన్ కల్యాణ్ ఒక్క సినిమా రెమ్యునరేషన్‌లో సగం పాతిక కోట్లు నాకే ఇస్తే, నా కుటుంబాన్ని జీవితాన్ని వదిలేస్తాను. మానవ బాంబుగా మారి YS Jagan‌ను లేపేస్తా అంటూ పోస్ట్ పెట్టాడు. అంతటితో ఆగకుండా అతనేంటి మా అన్నను తొక్కేది.. పేగులు మెడలో వేసుకొని తిరుగుతా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూర్చొంటా అంటూ నెటిజన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టుకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

మహేష్ బాబు ఫోటోతో ట్వీట్

మహేష్ బాబు ఫోటోతో ట్వీట్

అయితే పవన్ కల్యాణ్ అభిమానిగా చెప్పుకొంటూ చేసిన పోస్టుకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ డీపీ ఫోటో మహేష్ బాబు ఉండటం, అకౌంట్ పేరు బిజినెస్ మ్యాన్ అని పెట్టుకోవడం కొంత గందరగోళంగా మారింది. అయితే ఈ పోస్టుపై జనసేన పార్టీ వర్గాలు ఖండించాయి. ఈ పోస్టు పెట్టింది పవన్ కల్యాణ్ ఫ్యాన్ కాదు అని క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది.

జనసేన పార్టీ ఖండన

ఏపీ సీఏం వైఎస్ జగన్ గురించి అభ్యంతరకరమైన పోస్టు పెట్టడంపై జనసేన స్పందిస్తూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ముసుగులో ఎవరో ఇటువంటి పోస్టులు పెడుతున్నారు. కచ్చితంగా ఇది జనసైనికుల పనికాదు అనేదే నా భావన. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని dgpapofficial, APPOLICE100, CID_AP_Official వారికి విజ్ఞప్తి. అంటూ జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ కోసంపూడి ఖండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X