రజనీకాంత్ దారిలో... పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సూపర్ స్టార్ రజనీకాంత్ దారిలో నడవబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి. ప్రస్తుతం రజనీకాంత్ 'కొచ్చాడయాన్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీని వాడుతున్నారు.
హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితం అయిన ఈ టెక్నాలజీ... ఇండియాలోనే తొలిసారిగా కొచ్చాడయాన్ చిత్రంలో వాడుతున్నారు. దీని ద్వారా ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ క్వాలిటీ, ఎన్నో అద్భుతాలు చూపించ వచ్చు. ఖర్చు కూడా భారీగానే అవుతుంది.
ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించి భారీ బడ్జెట్‌తో...రొటీన్ సినిమాలకు భిన్నంగా పవన్ కళ్యాన్ ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు దర్శకులు, టెక్నీషియన్స్‌తో ఇందుకు సంబంధించి వివరాలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే భవిష్యత్‌లో పవన్ హీరోగా మనం ఒక భారీ సినిమాను ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత పవర్ స్టార్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











