అందుకు పవన్ కల్యాణ్ రెడీ.. ఎన్నికల ఫలితాల కోసమే వెయిటింగ్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తారంటూ వార్తలు అప్పుడప్పుడు మీడియాలో గట్టిగానే వినిపిస్తాయి. కానీ ఆచరణలోకి వస్తాయనే విషయంపై గత రెండేళ్లుగా స్పష్టత కరువైంది. గత రెండేళ్లుగా పవన కల్యాణ్ సినీ పరిశ్రమకు దూరమై జనంలోకి వెళ్లారు. జనసేన పార్టీ తరుఫున ప్రచారం చేస్తూ ప్రజా సమస్యలపై దృష్టిపెట్టారు. గత ఆర్నేళ్లుగా ఎన్ికల ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేసి వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ ప్లాన్ ఏంటనే విషయం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే

ఎన్నికల్లో గెలిచే సీట్లే కీలకం

ఎన్నికల్లో గెలిచే సీట్లే కీలకం

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు భారీగా సీట్లు వస్తాయనే విషయంపై అంతగా క్లారిటీ లేదు. ఒకవేళ పవన్ అనుకొన్నన్నీ లేదా.. ప్రభావం చూపే స్థాయిలో సీట్లు సంపాదించుకోకపోతే పరిస్థితి ఏంటనే విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

మైత్రీతో ఓ మూవీ కోసం ఒప్పందం

మైత్రీతో ఓ మూవీ కోసం ఒప్పందం

అయితే మైత్రీ మూవీస్‌తో ఒప్పందం జరిగి ఉండటం వల్ల తప్పనిసరిగా ఓ సినిమా చేస్తారనే విషయంపై కొంత క్లారిటీ ఉంది. స్వయంగా పవన్‌తో సినిమా చేస్తామని మైత్రీ మూవీస్ పత్రికా సమావేశంలో వెల్లడించారు కూడా. దాంతో ఎన్నికల తర్వాత వెసలుబాటు చేసుకొని మైత్రీ సినిమాలో నటించడం ఖాయమనే మాటకు బలం చేకూరుతున్నది.

 పవన్ కల్యాణ్‌పై మరో రూమర్

పవన్ కల్యాణ్‌పై మరో రూమర్

ఇదిలా ఉండగా, మరో రూమర్ ఇటీవల కాలంలో తెగ ప్రచారం అవుతున్నది. తనకు మిత్రుడు, నిర్మాత రామ్ తాళ్లూరితో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయనున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. రవితేజతో రూపొందించిన నేల టికెట్ సినిమా దారుణంగా బోల్తా కొట్టడంతో దారుణంగా నష్టాలు మిగిలాయి. ఆ తర్వాత మళ్లీ రవితేజ‌తోనే ఓ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. అయితే అంతంత మాత్రమే ముందుకెళ్తున్నది.

 జనసేనతో రామ్ తాళ్లూరి చనువుగా

జనసేనతో రామ్ తాళ్లూరి చనువుగా

అయితే గత కొద్దికాలంగా రామ్ తాళ్లూరి జనసేన పార్టీతో చనువుగా ఉంటున్నారు. ఆ పార్టీకి నిధులను సమకూర్చే బాధ్యతను కూడా పోషించారనే వార్త వినిపడింది. అలాంటి మిత్రుడిని ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి గట్టెక్కించడమే కాకుండా సినిమా రంగంలో సక్సెస్ ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ సుముఖంగా ఉన్నాడనే తెలిసింది.

పవన్ కల్యాణ్ ఎన్ని సినిమాలు చేస్తారంటే

పవన్ కల్యాణ్ ఎన్ని సినిమాలు చేస్తారంటే

ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే దానిని బట్టి పవన్ కల్యాణ్ అడుగులు ఎటు అనే విషయాన్ని తేల్చుతాయనేది సినీ వర్గాల టాక్. మే 23న వచ్చే తీర్పును బట్టి పవన్ కల్యాణ్ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ సినిమాలు చేస్తే ఇప్పటికిప్పుడు రెండు ప్రాజెక్టులు మాత్రం సిద్దంగా ఉన్నాయి. అలాగే ఏఎం రత్నంకు కూడా మరో సినిమా చేయాల్సి ఉంది. అదీ కూడా సెట్స్‌పైకి తీసుకెళ్తాడా అనేది మరో ప్రశ్నగా మిగిలింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X