twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘‘పవన్ కళ్యాణ్‌ను దేశద్రోహి అనడాన్ని ఎవరూ సహించరు’’

    |

    Recommended Video

    Tammareddy Bharadwaj About Pawan Kalyan | Filmibeat Telugu

    'నా ఆలోచన' పేరుతో తన మనసులోని అభిప్రాయాలను వెల్లడించే సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల సమయంలో పవన్ కళ్యాణ్ మీద వచ్చిన కొన్ని వార్తలపై రియాక్ట్ అయ్యారు.

    పవన్ కళ్యాణ్ గురించి పాకిస్థాన్ మీడియాలో ఎవరో మాట్లాడారని, భారత్-పాకిస్థాన్ యుద్ధం జరుగుతుందని ముందే చెప్పారని, ఆయన చెప్పినట్లే జరిగిందని, యుద్ధం జరుగుతుందని ఆయనకు ముందే తెలుసా? ఆయనేమైనా పాకిస్థాన్ ఏజెంటా? అంటూ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి పిచ్చి ప్రశ్నలన్నీ వేశారరని, ఇది సరైంది కాదంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.

    ఇలాంటి ప్రశ్నలు చాలా వేసుకోవచ్చు

    ఇలాంటి ప్రశ్నలు చాలా వేసుకోవచ్చు

    పవన్ కళ్యాణ్ పాకిస్థాన్ ఏజెంట్ అయితే 2014లో ఆయన్ను కలుపుకుని ఎన్నికల బరిలో దిగారు.. మరి మీరు కూడా పాకిస్థాన్ ఏజెంట్లా? మోడీగారు నవాజ్ షరీఫ్ బర్త్ డేకు ఎవరినీ అడగకుండా సెక్యూరిటీ సమస్య కూడా పట్టించుకోకుండా పాకిస్థాన్‌లో ల్యాండ్ అయి ఆయన్ను విష్ చేసి వచ్చారు. మరి ఆయన పాకిస్థాన్ ఏజెంటా? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే చాలా వేసుకోవచ్చని తమ్మారెడ్డి అన్నారు.

     ఎలక్షన్ టైమ్ కాబట్టే ఇలా

    ఎలక్షన్ టైమ్ కాబట్టే ఇలా

    మొన్న సర్జికల్ స్ట్రైక్ అయింది. నిన్న ఎయిర్ స్ట్రైక్ అయింది. మరి అవి జరిగిన మర్నాడే మోడీ గారు పబ్లిక్ మీటింగుల్లో చెప్పొచ్చా? మనం ఎప్పుడూ పాకిస్థాన్ మీద ఎయిర్ స్టైక్ చేయలేదా? మనం ఎప్పటికప్పుడు పాకిస్థాన్ దాడులను తిప్పికొడుతూనే ఉన్నాం. ఇది మొదటి సారికాదు. ఫస్ట్ టైమ్ చేసినట్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎలక్షన్ టైమ్ కాబట్టి మేమే చేశాం.. మేమే చేశాం అని చెప్పుకునే పరిస్థితి వస్తోంది... అని తమ్మారెడ్డి అన్నారు.

    వారి త్యాగాలను ఎలక్షన్ కోసం వాడొద్దు

    వారి త్యాగాలను ఎలక్షన్ కోసం వాడొద్దు

    పవన్ కళ్యాణ్ పాకిస్థాన్ ఏంజెంటని... నేను మాట్లాడాను కాబట్టి నేను పాకిస్థాన్ ఏజెంట్ అని.. దేశ ద్రోహులని ఇలా మాట్లాడుకుంటూ వెళుతున్నారు. మాట్లాడటం కాదు, చేతలు కావాలి. మిలట్రీ, ఎయిర్ ఫోర్స్ వారి పని వారు చేసుకుంటూ వెళతారు. సరిహద్దులో ప్రతి రోజూ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతోంది. ఐదేళ్ల నుంచి మీరు ఏమీ ఆపలేక పోయారు. మీ అసమర్దతను కప్పిపుచ్చుకోవడానికి ఈ రెండు సంఘటనలనుపదే పదే చెబుతున్నారు. ప్రతి రోజూ సైన్యం వారితో పోరాడుతూనే ఉంది. వారు ఈ ఒక్కరోజు వీరులు అవ్వడం లేదు. ప్రతి రోజూ వీరత్వం, దేశభక్తి చూపిస్తున్నారు. మీకు అవసరం వచ్చినపుడు మాత్రమే వారి దేశభక్తి మీకు కనిపిస్తోంది. ఎంతో మంది అమరులవుతున్నారు. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. వారి త్యాగాలను ఎలక్షన్ కోసం వాడుకోకూడదు... అన్నారు.

     పవన్ కళ్యాణ్‌ను దేశద్రోహి అనడాన్ని ఎవరూ సహించరు

    పవన్ కళ్యాణ్‌ను దేశద్రోహి అనడాన్ని ఎవరూ సహించరు

    ఈ దేశం మంచి కోసం ఆలోచించండి. ఇలాంటి పిచ్చి మాటలు మానేయండి. పవన్ కళ్యాణ్‌ను దేశద్రోహి అనడాన్ని ఎవరూ సహించరు. గత ఎలక్షన్లో మోడీగారు కూడా ఆయన్ను వెంటేసుకుని తిరిగారు. ఇప్పుడెలా దేశద్రోహి అయ్యాడు. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇక్కడ పవన్ కళ్యాణ్‌ను సపోర్ట్ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఒక మనిషిని మనం వాడుకుని, మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడితే ఆయన్ను ఇంకో రకంగా చిత్రీకరించడం తప్పు. పవన్ కళ్యాణ్‌కే కాదు ఎవరికీ అలా చేయొద్దని... తమ్మారెడ్డి సూచించారు.

    English summary
    PK Means Not Pawan Kalyan. Is Pawan Kalyan over-hyped? questions Tollywood Veteran Director Tammareddy Bharadwaj. He says, For Telugu audience, PK is an abbreviation for Power Star Pawan Kalyan. Like many small heroes and small films use the craze of Pawan Kalyan to market their name for self-benefits. Finally, he says Jana Sena Chief Pawan Kalyan is talking strangely in the recent times of campaigning at AP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X