twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ఫ్యాన్స్....మీ అభిప్రాయమేంటి?(కామెంట్ ప్లీజ్..)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ మీడియాలో రెండు మూడు రోజులుగా జోరుగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఈ విషయమై తమదైన రీతిలో స్పందిస్తున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చు, పవన్ కళ్యాణ్, నాగబాబు మా పార్టీలోకి వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం, వస్తే ఆహ్వానిస్తాం అని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా బహిరంగ ప్రకటన చేసారు.

    అయితే కేంద్ర మంత్రి చిరంజీవికి సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఇదంతా ఉత్తి ప్రచారమే అన్నారు. పవన్ సినిమాల్లో బిజీగా ఉన్నారని, ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసారు. మరో వైపు సినీ పరిశ్రమలోని పవన్ సన్నిహితులు కూడా పవన్ టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే వార్తలు రూమర్లే అని తేల్చేస్తున్నారు.

    అయితే నిప్పులేనిదే పొగరాదు.... అనేది చాలా మంది వాదన. ఇంత జోరుగా ప్రచారం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించే వారూ లేక పోలేదు. అఫ్ కోర్స్ ఇలాంటి రూమర్లపై పవర్ స్టార్ స్థాయి వ్యక్తి స్పందించాల్సిన అవసరం కూడా లేదనుకోండి. ఆయన అలాంటి అలవాటుకూడా లేదు. అయితే కనీసం అభిమానుల్లో నెలకొన్ని అయోమయానికి తెరదించేందుకైనా....సన్నిహితులతో ఒక అఫీషియల్ స్టేట్ మెంట్ ఇప్పిస్తే పోయేదేముంది అనేది కొందరి అభిప్రాయం.

    ఏది ఏమైనా...సినిమాలు, రాజకీయాలు అనేవి రెండు వేర్వేరు భిన్నమైన దారులు. సినిమాల్లో రాణించిన వారూ రాజకీయాల్లోనూ రాణిస్తారు అని కచ్చితంగా చెప్పలేం. వారి ఆలోచన పద్దతులతో పాటు పరిస్థితులు కూడా రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయి. తెలుగు సినిమా పరిశ్రమలో అందుకు చక్కటి ఉదాహరణ సినీయర్ ఎన్టీఆర్, చిరంజీవి.

    ఎన్టీ రామారావు, చిరంజీవి సినిమా రంగంలో టాప్ రేంజికి ఎదిగీ... ఆ తర్వాత కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినవారే. రామారావు పార్టీ పెట్టి వెంటనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ చిరంజీవి ఓటమి పాలయ్యి పార్టీని నడపలేక చేతులెత్తేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. ఒకరి ప్రయత్నం సఫలం కావడానికి, ఒకరి ప్రయత్నం విఫలం కావడానికి అప్పటి పరిస్థితులు, వారి ఆలోచన విధానాలే అని చెప్పక తప్పదు.

    ఇక్కడ మాత్రం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. రామారావు, చిరంజీవి అభిమానులు, ప్రజల కోరిక మేరకే రాజకీయాల్లోకి వచ్చారు అనేది వాస్తవం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం సంగతి పక్కన పెడితే.....అభిమానులు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం.

    పవన్ వ్యక్తిత్వం, ఆయన వ్యవహార శైలి, లైఫ్ స్టైల్ ఎలాంటిదో తెలుగు ప్రజలకు, అభిమానులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు సరిపోతారా? వస్తే ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలిస్తాయా? ఆయన ఆలోచన విధానాలు రాజకీయాల్లో సక్సెస్ కావడానికి ఉపకరిస్తాయా? అసలు ఆయన రాజకీయాల్లోకి రావడం ప్రజలు, అభిమానులకు ఇష్టమేనా? లేదా? అనేది ముఖ్యం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్సులో వ్యక్తం చేయండి.

    గమనిక: మీ అభిప్రాయం ఏమీటో నేరుగా ఒకట్రెండు వ్యాఖ్యాల్లో చెప్పండి. అసభ్య పదజాలం ఉపయోగించ కూడదని మనవి.

    English summary
    
 
 Is film star Pawan Kalyan who is the brother of Union Tourism Minister Chiranjeevi planning to join the TDP?. Is pawan kalyan suitable to politics. Please comment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X