twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాంబా.. పవన్ రెమ్యునరేషన్ ఇంతేనా?, లెక్క తప్పిందా.. లేక?..

    |

    టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ అందరి కన్నా స్పెషల్ అనేది ఆయన అభిమానుల అభిప్రాయం. ఫాలోయింగ్ రీత్యా.. కలెక్షన్ల రీత్యా.. ఏ పరంగా చూసుకున్నా.. పవన్ కల్యాణ్‌కు మిగతా హీరోలు సాటి రారని భావిస్తుంటారు.

    కానీ ఒక్క విషయంలో మాత్రం పవన్ ఎప్పుడూ వెనుకే ఉంటూ వస్తున్నాడు. అదే ఫోర్బ్స్ జాబితా. సంపాదన విషయంలో ఇటీవల ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన జాబితాలో పవన్ 67వ స్థానంలో నిలిచాడు.

    పవన్ గురించి ఇక్కడ జరిగే ప్రచారానికి.. 'ఫోర్బ్స్' విడుదల చేసిన ఈ జాబితాకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఈ లెక్కన పవన్ పై జరుగుతున్న ప్రచారం తప్పా.. లేక ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా తప్పా?.. అన్న విషయంపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

     పవన్ రెమ్యూనరేషన్‌పై చర్చ:

    పవన్ రెమ్యూనరేషన్‌పై చర్చ:

    సాధారణంగా పవన్ కల్యాణ్ తన సినిమాలకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారన్న ప్రచారం ఉంది. ఇండస్ట్రీలో ఇది మిగతా హీరోల కన్నా ఎక్కువ అన్న ప్రచారమూ ఉంది. ఒక్క సినిమాకు దాదాపు రూ.20నుంచి రూ.30కోట్ల వరకు ఆయన రెమ్యునరేషన్ ఉంటుందనే టాక్ వినిపిస్తుంటుంది.

    2017 ఫోర్బ్స్: సంపాదనలో పవన్, మహేష్‌లను మించిన రాజమౌళి, ప్రభాస్!2017 ఫోర్బ్స్: సంపాదనలో పవన్, మహేష్‌లను మించిన రాజమౌళి, ప్రభాస్!

     భారీ మొత్తం:

    భారీ మొత్తం:

    త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ ఏకంగా రూ.40కోట్లు తీసుకున్నారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇక కాటమరాయుడు సినిమాకు రూ.33కోట్లు తీసుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.

     నైజాం, ఓవర్ సీస్.. ఆయనవే:

    నైజాం, ఓవర్ సీస్.. ఆయనవే:

    పవన్ తన రెమ్యునరేషన్ ను నేరుగా కాకుండా నైజాం, ఓవర్ సీస్ హక్కుల రూపంలో తీసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. ఈ రెండు ఏరియాల్లో సినిమా అమ్మకాల వల్ల వచ్చే డబ్బు పవన్ ఖాతాలోకే వెళ్తుంది.

    ప్చ్!.. దాన్ని కొట్టలేకపోయారే!: రెండో స్థానానికే పరిమితమైన పవన్.. ప్చ్!.. దాన్ని కొట్టలేకపోయారే!: రెండో స్థానానికే పరిమితమైన పవన్..

     ఫోర్బ్స్ ఎందుకిలా:

    ఫోర్బ్స్ ఎందుకిలా:

    పవన్ రెమ్యునరేషన్ పై ఉన్న ప్రచారాన్ని గమనిస్తే.. ఆయన సంపాదన టాలీవుడ్ లో మిగతా వాళ్ల కన్నా ఎక్కువే అని చెప్పాలి. కానీ ఫోర్బ్స్ ప్రకటించిన జాబితా మాత్రం ఇందుకు భిన్నంగానే ఉంది.

    గతేడాది అగస్టు నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఆయా హీరోల సంపాదనను ఆధారంగా చేసుకుని ఫోర్బ్స్ జాబితా విడుదల చేస్తోంది. ఈ వ్యవధిలో పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు చేశారు. ఎంత లేదన్నా ఈ రెండు సినిమాలకు రూ.20కోట్లు చొప్పున పుచ్చుకుని ఉంటారు. కానీ!

     కానీ.., ఇంతేనా పవన్ రెమ్యునరేషన్?

    కానీ.., ఇంతేనా పవన్ రెమ్యునరేషన్?

    సరే, ట్యాక్సులు ఇతరత్రా అన్నీ మినహాయించిన కూడా ఆయన సంపాదన రూ.28కోట్ల వరకు ఉండవచ్చు. అలాంటిది ఫోర్బ్స్ మేగజైన్ మాత్రం పవన్ సంపాదన రూ.11కోట్లు అంటూ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. ఫోర్బ్స్ లెక్క ప్రకారం చూస్తే.. పవన్ రెండు సినిమాలకు కలిపి రూ.16కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని ఉండాలి. ట్యాక్స్ పోనూ ఆయన వద్ద మిగిలింది రూ.11కోట్లు. అంటే, ఒక సినిమాకు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ 8కోట్లేనా?..

     గతంలో నాగార్జున ఇలా:

    గతంలో నాగార్జున ఇలా:

    ఫోర్బ్స్ ప్రకటించే జాబితాపై గతంలో నాగార్జున భిన్నంగా స్పందించారు. అసలు ఆ జాబితా సరైంది కాదని, అంతా తప్పుడు లెక్కలు అన్నారు. తన ఆదాయాన్ని ఎక్కువగా చూపించారని అన్నారు. అంటే, కచ్చితమైన ఆధారాలు లేకుండానే.. ఫోర్బ్స్ ఈ జాబితాను ప్రకటిస్తోందా?.. పవన్ అభిమానులు మాత్రం జాబితాలో ఆయనకు 69వ స్థానం దక్కడం పట్ల ఒకింత ఆశ్చర్యంలోనే ఉన్నారు.

    English summary
    The latest Celebrity 100 list published by Forbes magazine turned out to be an embarrassment to Pawan Kalyan. The Forbes list ranked him 69 in the list with Rs.11.33 crores(From August 2016 to September 2017).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X