తెలుగు సినిమాకు రూ. 100 కోట్లు అవసరమా?
తెలుగులో బాహుబలి లాంటి 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాల నిర్మాణం పెరుగుతున్న నేపథ్యంలో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తనదైన విశ్లేషణ చేసారు.
హైదరాబాద్: తెలుగులో బాహుబలి లాంటి 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాల నిర్మాణం పెరుగుతున్న నేపథ్యంలో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తనదైన విశ్లేషణ చేసారు. ఇంత ఖర్చు అవసరమా అంటూ సాగిన ఆయన విశ్లేషణ ఆసక్తికరంగా, ఆలోచింపజేసే విధంగా ఉంది.
100 కోట్ల బడ్జెట్ లో ప్రజలు మెచ్చిన 'శతమానం భవతి' లాంటి హిట్ సినిమాలు 10 తీయొచ్చు. పెళ్లి చూపులు లాంటి సినిమాలు 40 తీయెచ్చు. 100 కోట్ల పెట్టే సినిమాలకు అసలు ఖర్చు కంటే అనవసర ఖర్చే ఎక్కువ అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
నష్టపోయేది ప్రేక్షుకుడే
సినిమా బడ్జెట్ పెరగడం వల్ల చివరకు భారం పడేది ప్రేక్షకుడిపైనే, సినిమా ఆడక పోతే నిర్మాత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన విశ్లేషించారు. వీడియోలో తమ్మారెడ్డి చెప్పిన పూర్తి విషయాలపై ఓ లుక్కేయండి.

‘బూతు బూతే.... ఆలోచించండి రామోజీరావుగారు

పాట ఎందుకు పాడావ్ వివాదం: బస్మాసుర హస్తమే, బాలుకు మద్దతు!
ఇటీవల ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం మధ్య నెలకొన్ని పాట ఎందుకు పాడావ్ వివాదంపై కూడా తమ్మారెడ్డి తనదైన అభిప్రాయం వెలుబుచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

చిరు, బాలయ్య, పవన్ తప్పు చేస్తున్నారా?
చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వెంట వెంటనే ఇన్ని సినిమాలు వేగంగా చేయడం వెనక 2019 రాజకీయాలకు లింక్ ఉందని, ఎక్కువ సినిమాలు చేసి వీలైనంత ఎక్కువ సంపాదించి.... ఆ డబ్బును 2019 ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై తమ్మారెడ్డి స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications