twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ హాట్రిక్ మిస్సయినట్లేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన గత రెండు సినిమాలు 'డార్లింగ్', 'మిస్టర్ పర్ ఫెక్ట్' చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆరెండు సినిమాలను మించిన అంచనాలతో ఈ రోజు విడుదలైన 'రెబల్' మూవీ మాత్రం తొలి రోజే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో 'రెబల్' హిట్టవుద్దా? ప్రభాస్ హాట్రిక్ కొడతాడా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.

    యాక్షన్ ప్రధానమైన సినిమా కాబట్టి ఫైట్స్ విపరీతంగా ఉండటం సహజమే. అయితే సినిమా కంటెంట్ బలంగా ఉండాలి. సినిమా కథ అంతా సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చెబుతున్నపుడు ఫస్టాఫ్ లో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంటేనే ప్రేక్షకుడు సీట్లో కూర్చుంటాడు. కానీ సినిమాలో దీన్ని దర్శకుడు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేక పోయాడు. లారెన్స్ తన గత చిత్రాల్లోని కాపీ సీన్లు రిపీట్ చేయడం, చెత్తగా సంగీతం సమకూర్చడం సినిమాకు మరో మైనస్ అయి పోయింది. అయితే ప్రభాస్ అభిమానులకు, మాస్ ఆడియన్స్ కు మాత్రం నచ్చే విధంగానే ఉందంటున్నారు.

    గతంలోనూ డార్లింగ్ చిత్రానికి కూడా మిక్స్ టాకే వినిపించినా ఆ తర్వాత పుంజుకున్నాయి. మరి రెబల్ చిత్రం కూడా పుంజుకుంటుందో.... మిక్స్ డ్ టాక్ తో చతికిల పడుతుందో కొద్ది రోజుల్లో తేల నుంది. రాష్ట్రంలోని పరిస్థితులు కూడా రెబల్ సినిమాకు కష్టాలు తెచ్చిపెట్టవచ్చనే వాదన కూడా మరో వినిపిస్తోంది.

    ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

    English summary
    Prabhas who carried a lover boy image in his earlier films like Darling and Mr.Perfect, He has completely transformed into Mass role gave a shock to audience who in turn gave a big shock to the hero. With all web media giving very poor rating Rebel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X