ఇక రవితేజను కాపాడేది అతనొక్కడే...!
ఒకప్పుడు వరుస హిట్టలో మినిమమ్ గ్యారంటీ హీరోగా, మాస్ మహరాజ్‌గా పేరు తెర్చుకున్న ఎనర్జిటిక్ హీరో రవితేజ....మళ్లీ వరుస ప్లాపులతో వెనకబడి పోతున్నాడు. దొంగల ముఠా, వీర, నిప్పు పరమ ప్లాపుల తర్వాత తాజాగా విడుదలైన 'దరువు' చిత్రం కూడా అనుకున్న అంచనాలను అందుకోలేదు. యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఈ నేపథ్యంలో రవితేజ మళ్లీ తన మిత్రుడు పూరి జగన్నాథ్ పైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రాలతోనే రవితేజకు స్టార్ హీరో హోదా వచ్చింది. అనంతరం వీరి కాంబినేషన్లో వచ్చిన 'నేనింతే' చిత్రం అవార్డులు తెచ్చి పెట్టింది.
ప్రస్తుతం రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం రూపొందుతోంది. పూరి మళ్లీ తనకు హిట్ ఇచ్చి వరుస ప్లాపుల నుంచి ఉపశమనం కలిగిస్తాడని రవితేజ నమ్మకంతో ఉన్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియాన నటిస్తోంది.
ఈ చిత్రం ద్వారా రవితేజ సరసన ఇలియాన మూడోసారి జతకడుతోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ రియలన్స్ ఎంటర్ టైన్మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా తదితరలు నటిస్తున్నారు. సంగీతం: రఘు కుంచె, ఎడిటింగ్: ఎస్ ఆర్ శేఖర్, నిర్మాత: బివిఎస్ఎం ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











