పుష్ప 2 మూవీ రిలీజ్‌కు ఎదురు దెబ్బ.. ఆ దేశంలో షాకిచ్చిన కల్కి వివాదం
దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్‌లో ప్రారంభమవ్వగా కలెక్షన్లపరంగా భారీ స్పందన కనిపిస్తున్నది. అయితే ఓవర్సీస్‌లో ఓ దేశంలో సినిమా రిలీజ్‌కు కల్కి వివాదం అడ్డుగా నిలుస్తున్నది. ఆ వివాదం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను ఊచకోత కోసింది. అయితే ఈ సినిమా నార్త్ అమెరికాలోని ఓ భాగమైన కెనడాలో కూడా భారీగా రిలీజైంది. కెనడాలో కూడా రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ చిత్రంగా కల్కి ఘనతను సాధించింది.

అయితే కల్కి సినిమా విషయంలో స్థానిక చైన్ థియేటర్, డిస్టిబ్యూటర్ల మధ్య వివాదం భారీగా ఉంది. పంపిణీదారుడి వద్ద నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్ ఉండటంతో థియేటర్ల యజమానాలు పుష్ప 2 సినిమా రిలీజ్‌కు మోకాలు అడ్డినట్టు తెలుస్తుంది. తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాల్సిందే అని ఆగ్రహంతో ఉన్నారట. అందుకే సదరు ఢిస్టిబ్యూటర్ రిలీజ్ చేసే సినిమాలను స్క్రీనింగ్ చేయమని వెల్లడించినట్టు సమాచారం.
ప్రస్తుతం కల్కి వివాదం పుష్ప 2 రిలీజ్‌కు అడ్డగా మారింది. అయితే కెనడాలో పుష్ప 2 హిందీ వెర్షన్‌ను రిలీజ్‌కు ఈ వివాదం గందరగోళంలో పడేసింది. కల్కి సినిమాకు చెల్లించిన మొత్తం చెల్లించకపోతే పుష్ప 2 మూవీ హిందీ వెర్షన్ విడుదలను అడ్డుకొంటామని హెచ్చరించారు. ప్రస్తుతం చైన్ థియేటర్, పంపిణీదారుడి మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.
ఇదిలా ఉండగా, కెనడాలో సినిమా రిలీజ్ విషయంలో తలెత్తిన వివాదంపై మైత్రీ మూవీస్ దృష్టిపెట్టారు. నిర్మాతలు తమ సినిమాకు అడ్డుగా నిలిచిన వివాదాన్ని సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా సమయం ఉండటంతో ఈ వివాదం పరిష్కరించబడుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తున్నది.

ఇదిలా ఉండగా, పుష్ప 2 ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేశారు. అభిమానుల్లో జోష్ పెంచడానికి రకరకాల అప్ డేట్స్ డిజైన్ చేస్తున్నారు. ఆ ప్లాన్‌లో భాగంగానే పుష్ప 2 మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను నవంబర్ 11వ తేదీన ఇవ్వనున్నారు. పుష్ప 2 ఎక్ల్సూజివ్ అప్ డేట్స్ కోసం తెలుగు ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి


Click it and Unblock the Notifications











