Pushpa 2: పుష్ప 2 ఐటెమ్ సాంగ్ లీక్ ! మార్ఫింగ్ ఫొటోలు వైరల్..
Pushpa 2 Item Song: ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'(Pushpa The Rise). ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ స్పెషల్ సాంగ్. తాజాగా పుష్ప 2 ఐటెం సాంగ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే.. అవి రియల్ ఫోటోలో..? మార్ఫింగ్ ఫోటోలో ..? అనే వివరాల్లోకెళితే..
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప2'. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుడు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా మోస్ట్ వాంటెడ్‌గా నిలుస్తోంది. ఈ మూవీని డిసెంబర్ 5న ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలని మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పుష్ప 2 సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే.. ఒక ఐటెం సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో ఎవరు నటించబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

పుష్ప 1 ఐటం సాంగ్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్టెప్పులేయగా.. పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం ముందుగా ప్రభాస్ బ్యూటీ శ్రద్దా కపూర్ ను దించాలని అనుకున్నారట. కానీ ఈ అమ్మడు భారీ మొత్తంలో డిమాండ్ చేయడం, డేట్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదట. దాంతో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలను ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో కొంతమంది కేటుగాళ్లు.. వేరే సాంగ్‌కి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్, శ్రీలల ముఖాలతో మార్ఫింగ్ చేసి కొన్ని ఫొటోలను, వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
పుష్ప 2 ఐటెం సాంగ్ లీక్ అంటూ పలు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. ఆ మార్ఫింగ్ ఫొటోలను చూస్తుంటే నిజంగానే పుష్ప 2 ఫోటోలే అనుకోవాలి. కానీ, అదే సమయంలో ఓ వీడియో వైరల్ అవుతుండటంతో.. అసలు విషయం అర్థమైంది.ప్రస్తుతం మార్పింగ్ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై మూవీ మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

#Pushpa2ThaRule pic.twitter.com/kuvvHh78iS
— Pinku (@pinkutalks) November 8, 2024
ఇక పుష్ప-2 విషయానికి వస్తే.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో.. మొత్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల కాబోతుంది. ఇందులో ఇండియాలో 6500 స్క్రీన్స్, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌లతో చాలా గ్రాండ్ విడుదల కాబోతున్నట్టు మూవీ మేకర్స్ తెలిపారు. అలాగే.. ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా పుష్ప 2 దుమ్మురేపినట్టు తెలుస్తోంది. రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప 2 దేశంలోనే అత్యంత భారీ బిజినెస్ మూవీగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప 2 డిసెంబర్ 5 నుంచి ఎలాంటి ప్రభంజనం స్రుష్టిస్తోంది వేచి చూడాలి. మరి బాక్సాఫీస్ లో పుష్పాగాడి రూల్ ఏ విధంగా ఉండబోతుందో తెలియాలంటే.. డిసెంబర్ 5 వరకు వేచిచూడాల్సిందే..


Click it and Unblock the Notifications











