రాయ్ లక్ష్మి గర్భవతా.. నాకు చాలా మందితో ఎఫైర్ ఉంది.. అయితే ఏంటి!
హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి అందాలకు ఫిదా కాని కుర్రకారు ఉండరు. 2005లో కాంచన మాల కేబుల్ టీవీ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత హీరోయిన్ గా రాణించింది. గ్లామర్ రోల్స్ లో నటించి అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా రాయ్ లక్ష్మి మెరుస్తోంది. రాయ్ లక్ష్మి పై రూమర్స్ కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఏకంగా మహేంద్రసింగ్ ధోనీతోనే ఒకప్పుడు తనకు రిలేషన్ లో ఉన్నానని రాయ్ లక్ష్మి పలు ఇంటర్వ్యూలలో వెల్లడించింది. తాజాగా తన గురించి ఓ షాకింగ్ రూమర్ ప్రచారం జరుగుతుండడంతో రాయ్ లక్ష్మి ఘాటుగా స్పందించింది.

రాయ్ లక్ష్మి గర్భవతా
రాయ్ లక్ష్మికి ప్రెగ్నెన్సీ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పలు సందర్భాల్లో లవ్ ఎఫైర్స్ తో వార్తల్లో నిలిచిన రాయ్ లక్ష్మి తాజాగా ఇలాంటి రూమర్ కూడా వ్యాపించింది. లవ్ ఎఫర్స్ రూమర్స్ ని రాయ్ లక్ష్మి ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ తన కెరీర్ ని దెబ్బతీసేలా ప్రెగ్నెసీ వార్తలు సృష్టించడంతో ఈ భామ మండిపడుతోంది. ఓ ఇంటర్వ్యూలో పుకార్లపై ఘాటుగా స్పందించింది.
అదే పనిగా పెట్టుకున్నారు
కొంతమంది నా గురించి చెత్త వార్తలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. నాకు చాలా మందితో లవ్ ఎఫైర్స్ ఉన్నాయి. బ్రేకప్ కూడా జరిగింది. అంత మాత్రాన నా విషయంలో మీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తారా అంటూ రాయ్ లక్ష్మి ఘాటుగా స్పందించింది. నేను పచ్చి మామిడి కాయలు తిన్నా గర్భవతి అని మాట్లాడేస్తున్నారు అని మండిపడింది. నా గురించి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది.

చాలా ఈజీగా
తాను చిత్రపరిశ్రమలోకి ప్రవేశించడానికి నేను ఎక్కువగా కష్టపడలేదు. సులభంగానే ఆరంభంలో అవకాశాలు వచ్చాయి. కాస్టింగ్ కౌచ్ విషయంలో చిత్ర పరిశ్రమ గురించి జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. ఆరంభంలో కొన్ని చిత్రాలు చేశాక ఇబ్బందులు ఎదుర్కున్నా. కానీ అది కాస్టింగ్ కౌచ్ వలన కాదు. కొంతమంది నాకు తప్పుడు సలహాలు ఇచ్చారు. కానీ చిత్రపరిశ్రమలో చాలా మంది మంచివారు ఉన్నారని రాయ్ లక్ష్మి పేర్కొంది.

అది నిజమే
తన ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుతూ.. నాకు ఎవరితోనూ ఎఫైర్ లేదని ఎప్పుడూ చెప్పలేదు. చాలా మందితో నా రిలేషన్ కొనసాగింది. ఇప్పటికి ఓ మంచి వ్యక్తితో రిలేషన్ లో ఉండాలని కోరుకుంటున్నా. రిలేషన్ లేకుండా ఎవరి జీవితమూ ఉండదు. ఎదో ఒక సందర్భర్భంలో అందరూ వివాహం చేసుకోవాల్సిందే అని రాయ్ లక్ష్మి తెలిపింది. నా వ్యక్తిగత విషయాలు దాచి పెట్టను.. అలాగని పబ్లిక్ గా చెప్పుకోను అని రాయ్ లక్షి సమాధానం ఇచ్చింది.


Click it and Unblock the Notifications











