రాజమౌళి ‘ఈగ’ ప్రయోగంతో ఫోభియాలో కూరుకు పోయాడా...
ప్రభాస్ తో సినిమా చేయడానికి కమిట్ అవడంతో మర్యాద రామన్న తర్వాత రాజమౌళికి కాస్త గ్యాప్ వచ్చింది. మార్చి వరకు ప్రభాస్ బిజీగా ఉండడంతో ఈలోగా మరో పెద్ద సినిమా చేయడం కుదరదు కనుక అతనొచ్చే వరకు వెయిట్ చేయడమే మంచిదని రాజమౌళి డిసైడ్ అయ్యాడు. అయితే ఈ ఆరు నెలల కాలాన్ని వధా చేసుకోవడ కంటే ఏదైనా చిన్న ప్రయోగం చేస్తే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నాడు. అందుకే 'ఈగ" అనే యానిమేషన్ సినిమాకి శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నాడు.
ఈ చిత్రాన్ని హాలీవుడ్ యానిమేషన్ సినిమా స్థాయిలో రూపొందించాలని రాజమౌళి ఆశిస్తున్నాడు. అయితే కమర్షియల్ డైరెక్టర్ గా తనకున్న పేరుని ఇలాంటి ప్రయోగాలతో పోగొట్టుకుంటానేమోననే భయం కూడా రాజమౌళిని వెంటాడుతోంది. 'మర్యాద రామన్న" హిట్ అయినా కానీ రాజమౌళి చేయాల్సిన సినిమా అయితే కాదనిపించుకుంది. ఇప్పుడు మళ్లీ 'ఈగ" అంటూ ప్రయోగానికి దిగితే తన స్థాయిని తానే తగ్గించుకున్నట్టవుతుందని రాజమౌళికి అనుమానంగా ఉంది. 'ఈగ"ని ఇప్పటికిప్పుడు తెరకెక్కించినా, లేకపోయినా కనీసం దానికి కావాల్సిన సరంజామా అంతా సిద్దం చేసుకుంటే ఏదో ఒక రోజు ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశముంటుందని ప్రస్తుతం దానిమీద దృష్టి పెట్టాడు. కానీ ప్రభాస్ తో చేసే సినిమాకి మాత్రం రాజమౌళి ఇంతదాకా స్క్రిప్ట్ ఓకే చేయలేదు.


Click it and Unblock the Notifications











