ఆ ఇద్దరు దర్శకులంటే రాజమౌళికి భయం!
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెం.1 దర్శకుడు ఎవరంటే ముందుగా వినిపించే పేరు ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి అలియాస్ జక్కన్న. రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ భారీ విజయం సాధించినవే. ఇటీవల ఈ దర్శకుడు రూపొందించిన 'ఈగ' చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా చాటింది.
మరి ఇంత సత్తా ఉన్న రాజమౌళి ఇతర దర్శకులను చూసి కాంపిటీషన్ పరంగా భయ పడతారా? అయన్ను భయపెట్టే దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నరా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వాళ్లెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మరొకరుడు ప్రేమ చిత్రాల దర్శకుడు సుకుమార్.
ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రాజమౌళి పాల్గొన్నాడు. ఈసందర్భంగా యాంకర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు పోటీగా ఎవరిని భావిస్తున్నారని అడగ్గా....త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ పేర్లను వెల్లడించారు జక్కన్న. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఆ ఇద్దరు దర్శకులు తన నెం.1 స్థానానికి ఎసరు పెట్టగల సత్తా ఉన్న దర్శకులు అని చెప్పకనే చెప్పారు రాజమౌళి.
'ఈగ' సక్సెస్‍తో చాలా హ్యాపీగా ఉన్న రాజమౌళి తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు సమాచారం. ఇందులో విశ్వామిత్రగా 'యంగ్ రెబల్ స్టార్' ప్రభాస్ నటించబోతున్నారు. రాజమౌళి దర్సకత్వంలో రూపొందబోయే చిత్రం కోసం ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











