Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
రజనీ 'రోబో' ...బాలకృష్ణ 'సింహా' చిత్రాన్ని క్రాస్ చేసిందా?
రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం వసూళ్ళను ఈ సంవత్సరం పెద్ద హిట్ గా నిలిచిన సింహా తో పోల్చి చూస్తున్నారు. అయితే సింహా కలెక్షన్స్ ని రోబో ఇప్పటికే దాటేసిందని తెలుస్తోంది. సింహా కన్నా బడ్జెట్ కన్నా తక్కువ మొత్తానికి తెలుగు రైట్స్ ని తీసుకున్నారని,అలాగే రోబో డబ్బింగ్ చిత్రం కాబట్టి టాక్స్ నిమిత్తం ఎక్కువ గవర్నమెంట్ కి పోతుందని అయినా మిగిలిన మొత్తం సింహాని దాటిందని తేలుస్తున్నారు. ఈ మేరకు తెలుగు నిర్మాతలు చాలా మంది ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని మరో సారి చర్చలు జరపాలని ఆలోచన చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
దాంతో రోబో చిత్రమే ఈ సంవత్సరపు ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు. అలాగే ఈ చిత్రం వందరోజుల నాటికి ఏ రేంజికి ఈ కలెక్షన్స్ మొత్తం చేరుకుంటుందనేదానిపై కూడా ఆశ్చర్యపరిచే అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే తమిళంలో రికార్డు బ్రేక్ చిత్రంగా రోబో నిలిచింది. హిందిలో మాత్రం ఈ చిత్రం ప్లాఫ్ అయినట్లేనని నిర్దారించారు. మరో ప్రక్క 29 రోజు లకు "రోబో" (తెలుగు) కలెక్షన్ రూ. 60 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాత కన్నారావు చెప్తున్నారు. దాదాపు రూ. 100 కోట్ల వరకు వసూ లు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రోబో చిత్రాన్ని అంత పెద్ద మొత్తానికి ఎవరూ కొనటానికి ముందుకు రాకపోతే కన్నారావు ధైర్యం చేసి 27 కోట్లకు కొనుగోలు చేసారు.